త్రివిక్ర‌మ్ కూడా రాజ‌మౌళిలా ఆలోచిస్తున్నాడా?

ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి సినిమాల్లో హాలీవుడ్ టెక్నాల‌జీ క‌నిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో యాక్ష‌న్ స‌న్ని వేశాలు డిజైన్ చేస్తుంటారు.;

Update: 2025-07-17 16:30 GMT

ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి సినిమాల్లో హాలీవుడ్ టెక్నాల‌జీ క‌నిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో యాక్ష‌న్ స‌న్ని వేశాలు డిజైన్ చేస్తుంటారు. 'బాహుబ‌లి', 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాల్లో అది స్ప‌ష్టంగా కనిపించింది. హాలీవుడ్ స‌న్నివేశాల్ని స్పూర్తిగా తీసుకున్నా? ఇంకెలా తీసుకున్నా? త‌న మేకింగ్ తో ఆక‌ట్టుకోవ‌డం రాజ‌మౌళికే చెల్లింది. అందుకే నేడు గ్లోబ‌ల్ స్థాయిలో నీరాజ‌నాలు అందుకుంటున్నారు. మ‌రి గురూజీ త్రివిక్ర‌మ్ కూడా ఇప్పుడు రాజ‌మౌళిని అనుస‌రిస్తున్నారా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్ ఆధా రంగా తెరకెక్కించ‌నున్నారు. 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ కూడా ప్రచారంలో కి వ‌చ్చింది. భారతీయ పురాణాలలో యుద్ధ దేవుడైన‌ లార్డ్ కార్తికేయ క‌థ ఆధారంగా స్టోరీ సిద్దం చేసిన‌ట్లు వినిపిస్తుంది. ఇటీవ‌లే తార‌క్ కూడా అదే త‌రహా పుస్త‌కం చ‌దువుతున్న‌ట్లు క్లారిటీ వ‌చ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను ఓ వీడియో గ్లింప్స్‌తో గ్రాండ్ గా లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేసారు.

ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత నాగ వంశీ కూడా వెల్ల‌డించారు. కానీ బాలీవుడ్ 'రామాయ‌ణం' వీడియో చూసిన త‌ర్వాత గురూజీ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. రామ‌యాణంలో హై ఎండ్ విజువ‌ల్ ఎఫెక్స్ట్ చూసి స‌ర్ ప్రైజ్ అయ్యారు. తాను కూడా గ్లింప్స్ వ‌దిలితే ఈ రేంజ్ లో ఉండాలి? లేదా అంత‌కు మంచి ఉండాలని డిసైడ్ అయ్యారు. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్రీ టీజ‌ర్ వ‌ద‌లితే బాగుంటుంద‌ని భావించి తాత్కాలికంగా రిలీజ్ ఆలోచ‌న విరమించు కున్నారుట‌.

టెక్నాల‌జీ ప‌రంగానూ త్రివిక్ర‌మ్ ఇంకా అప్ డేట్ కావాల‌ని.. దీనికి సంబంధించి హాలీవుడ్ స్టూడియోల‌తో చ‌ర్చించాల‌ని భావిస్తున్నారుట‌. హాలీవుడ్ ప్ర‌మాణాల‌తో త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా సినిమా ఉండాల‌ని గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. సాధార‌ణంగా స్టోరీల విష‌యంలో గురూజీ కూడా హాలీవుడ్ సినిమా స్టోరీల నుంచి ఇన్ స్పైర్ అవుతుంటారు. వాటి స్పూర్తితో తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు వేగంగా స్క్రిప్ట్ సిద్దం చేయ గ‌ల‌రు. తాను నేర్చుకోవ‌డం మొద‌లు పెడితే ఆ ప‌ని చాలా వేగంగా పూర్తి చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్.

Tags:    

Similar News