విజయ్‌ తో రిలేషన్.. త్రిష తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిందా?

స్టార్ హీరోయిన్ త్రిష, తమిళనాడు సీఎం విజయ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2026-06-02 11:41 GMT

స్టార్ హీరోయిన్ త్రిష, తమిళనాడు సీఎం విజయ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు త్రిష గానీ, విజయ్ గానీ రెస్పాండ్ అవ్వలేదు. కానీ తాజాగా త్రిష పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.




 


త్రిష తన పెంపుడు కుక్క ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఆ ఫోటోకు "నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నేను అనుమతించేది దీనికి మాత్రమే" అంటూ రాసుకొచ్చారు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు, తన పర్సనల్ లైఫ్ పై వస్తున్న రూమర్స్‌ కు త్రిష పరోక్షంగా సమాధానం ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, తన గురించి మాట్లాడుతున్న వారికి ఆ పోస్ట్ ద్వారా కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.




 


ఇదిలా ఉంటే.. త్రిష ఇటీవల మ్యాజికల్ మే అంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెల్ఫీలు, పెంపుడు కుక్కతో ఉన్న క్యూట్ మూమెంట్స్, పర్సనల్ మెమోరీస్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెల తనకు చాలా ప్రత్యేకమని త్రిష పేర్కొన్నారు.




 


ఈ నెలలో జరిగిన కొన్ని స్వీట్ మూమెంట్స్ ను తలుచుకుంటే తనకు ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఆ మెమోరీస్ లైఫ్ లాంగ్ తన ఫేస్ పై చిరునవ్వు తీసుకొస్తాయని ఆమె రాసుకొచ్చారు. అలాగే వయసు గురించి కూడా త్రిష ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇచ్చారు. 40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడం కంటే, 20 ఏళ్ల యువతులు 40 ఏళ్ల వయసుని చూసి భయపడకుండా ఆ స్టేజ్ కోసం ఎదురు చూసేలా చేయడమే గొప్ప విషయమని పేర్కొన్నారు.




 


దీంతో ఆమె కామెంట్స్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు, త్రిష మ్యాజికల్ మే అని పెట్టడంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మే నెలలో ఆమె పుట్టినరోజు జరుపుకోవడం, అదే సమయంలో విజయ్ రాజకీయ జీవితంలో పెద్ద విజయం సాధించడం వంటి విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆమె ఈ నెలను ప్రత్యేకంగా పేర్కొన్నారేమో అని మాట్లాడుకుంటున్నారు.

గతంలో కూడా విజయ్, త్రిష కలిసి కొన్ని కార్యక్రమాల్లో కనిపించారు. దీంతో వీరిద్దరి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలపై సైలెంట్ గానే ఉంటున్నారు. రూమర్స్‌ పై స్పందించకుండా తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు త్రిష చేసిన తాజా పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ లో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడనని ఆమె చెప్పిన విధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో విజయ్‌ తో తనపై వస్తున్న రిలేషన్‌ షిప్ వార్తలకు త్రిష ఇదే తనదైన స్టైల్లో ఇచ్చిన సమాధానమా అనే చర్చ కొనసాగుతోంది.

Tags:    

Similar News