త్రిషకు ఉపాసన సర్ ప్రైజ్.. ఆ గిఫ్ట్ లో ఏముందంటే

ఉపాసన సొంతంగా నిర్వహిస్తున్న అత్తమ్మాస్ కిచెన్ బ్రాండ్ తరపున ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్ త్రిష ఇంటికి చేరింది.

Update: 2026-06-03 06:47 GMT

సౌత్ క్వీన్ త్రిషకు మెగా కోడలు ఉపాసన కొణిదెల ఒక సమ్మర్ గిఫ్ట్ పంపారు. ఉపాసన సొంతంగా నిర్వహిస్తున్న అత్తమ్మాస్ కిచెన్ బ్రాండ్ తరపున ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్ త్రిష ఇంటికి చేరింది. సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ పూర్తిగా ట్రెడిషనల్ టచ్ ఉన్న గిఫ్ట్ రావడం విశేషం. ఈ పార్సిల్ చూసిన వెంటనే త్రిష ఎంతో ఆనందపడిపోయారు. తన సోషల్ మీడియాలో ఆ ఫుడ్ ఐటమ్స్ ఫోటోలను షేర్ చేసి థాంక్స్ చెప్పారు. వేసవి కాలం వచ్చేసిందన్న ఫీలింగ్ ఈ గిఫ్ట్ వల్లే కలిగిందని ఆమె రాసుకొచ్చారు.



 


ఇంతకీ ఆ స్పెషల్ బాక్స్ లో ఏముందంటే తెలుగింటి వేసవిలో అందరూ ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడితో పాటు రకరకాల హోమ్ మేడ్ పొడులు ఆ ప్యాకేజీలో ఉన్నాయి. కేసరి, పొంగల్ లాంటి ఐటమ్స్ కూడా అందులో ప్యాక్ చేసి ఉంచారు. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఉపాసన మన సంప్రదాయ వంటకాలను ఆన్లైన్ లో సేల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజినెస్ ప్రమోషన్ లో భాగంగానే తనకు పరిచయం ఉన్న స్టార్స్ కు బహుమతులు పంపుతున్నారు. స్వచ్ఛమైన ఇంటి భోజనం రుచిని సెలబ్రిటీలకు పరిచయం చేయాలన్న ఆమె ఆలోచనకు మంచి స్పందన వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో నేరుగా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుండటం అభిమానులకు కిక్ ఇస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ కుటుంబంతో ఏర్పడిన చనువు కొద్దీ ఉపాసన స్వయంగా ఈ బహుమతిని పంపి ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇక త్రిష కెరీర్ విషయానికొస్తే వయసు పెరుగుతున్నా కొద్దీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది థగ్ లైఫ్, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, ప్రస్తుతం మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా సూర్య కరుప్పు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం విశ్వంభర. చిరంజీవి లాంటి మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని, సెకండ్ హాఫ్ లో ఆమె యాక్టింగ్ హైలైట్ అవుతుందని సమాచారం.

​తెలుగుతో పాటు మలయాళంలో కూడా త్రిష పెద్ద ఛాన్సులు అందుకుంటోంది. అక్కడ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే మరో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ రెండు సినిమాలు త్రిష ఫ్యూచర్ కు చాలా కీలకం కానున్నాయి. ఒకవైపు తెలుగులో మెగాస్టార్, మరోవైపు మలయాళంలో కంప్లీట్ యాక్టర్.. ఇలా ఇద్దరు సీనియర్ స్టార్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సౌత్ లో తన మార్క్ చూపిస్తున్నారు. కుర్ర హీరోయిన్లు వస్తున్నా సరే, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకోవడం త్రిషకే సాధ్యమైంది.

Tags:    

Similar News