ఆ ముగ్గురు పాలిట మెగాస్టార్ ఆపద్బాందవుడు!
దీంతో చేతిలో ఉన్న `విశ్వంభర` చిత్రం కీలకంగా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.;
సీనియర్ బ్యూటీలు త్రిష, నయనతార కెరీర్ ఇప్పుడంత స్పీడ్ గా లేదు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తు న్నారు. హీరోల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హీరోతో పాటు కథ కూడా పక్కాగా ఉంటేనే కమిట్ అవుతున్నారు. లేదంటే వచ్చిన అవకాశాలే వదులుకుంటున్నారు. ఈ క్రమంలో రిలీజ్ లకు గ్యాప్ ఏర్పడుతుంది. త్రిష గత చిత్రం `థగ్ లైఫ్` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నమోదైంది. దానికంటే ముందు రిలీజ్ అయిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` పర్వాలేదనిపించినా ఆ సక్సెస్ ని `థగ్ లైఫ్` తో కొనసాగించ లేకపోయింది.
వరుస వైఫల్యాలు:
దీంతో చేతిలో ఉన్న `విశ్వంభర` చిత్రం కీలకంగా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరో సినిమా `కురుప్పు` కూడా చేస్తోంది. కానీ భారీ అంచనాలు మాత్రం చిరంజీవి చిత్రంపైనే పెట్టుకుంది. `విశ్వంభర` సక్సెస్ తో తెలుగులో బిజీ అవ్వాలని ఆశపడుతోంది. మరోవైపు లేడీ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోన్న నయనతార కూడా వరుస పెయిల్యూర్స్ లో ఉంది. `జవాన్` తర్వాత చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. సమ్మర్ లో రిలీజ్ అయిన `టెస్ట్` కూడా ఫెయిలైంది.
157పైనే ఆశలన్నీ:
దీంతో ఈ ఏడాది మరో రిలీజ్ కూడా చేతిలో లేదు. కొత్త సినిమాలు చాలా చేస్తోంది. కానీ అవన్నీ రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాదే. అందులో చిరంజీవి 157వ చిత్రం కీలకంగా మారింది. ఇందులో చిరుకు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2026 రిలీజ్ లు అన్నింకంటే ఎక్కువగా నయన్ పోకస్ చేసిన చిత్రం కూడా ఇదే. అందుకే సినిమా కోసం తన ప్రమోషన్ నిబంధనలు సైతం పక్కన బెట్టి ప్రచార బరిలో నిలిచింది.
చిరంజీవి సక్సెస్ కీలకం:
మరోవైపు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కూడా చిరంజీవి సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. `విశ్వంభర`లో అమ్మడు ఐటం పాటలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది భామల్ని పరిశీలించి చివరిగా మౌనీ రాయ్ ని తీసుకున్నారు. ఆమెకు కూడా సరైన అవకాశాలు లేని సమయంలో వచ్చిన గొప్ప ఛాన్స్ ఇది. ఈ పాటతో సక్సెస్ అందుకుని నటిగా, నర్తకిగా బిజీ అవ్వాలనే ప్లాన్ లో ఉంది. మరి ఈ ముగ్గురికి మెగాస్టార్ ఎలాంటి సక్సెస్ ఇస్తారో చూడాలి.