ఆ బ్యూటీని టాలీవుడ్ లైట్ తీసుకుందా?
`యానిమల్` హిట్ తో త్రిప్తీ డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ అమ్మడి తల రాతనే మార్చేసింది.;
`యానిమల్` హిట్ తో త్రిప్తీ డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ అమ్మడి తల రాతనే మార్చేసింది. బాలీవుడ్ లో బిజీ నాయికగా మారిపోయింది. వెంట వెంటనే నాలుగైదు కొత్త సినిమాలకు సైన్ చేయడం హిట్ కొట్టడం అన్నీ జరిగిపోయాయి. అప్పటి వరకూ అవకాశాల కోసం బాలీవుడ్ మొత్తం తిరిగినా పట్టించుకోని పరిశ్రమ `యానిమల్` హిట్ నెత్తిన పెట్టుకుంది. హిట్ తో కెరీర్ ఇంత గొప్ప గా ఉంటుందని ప్రూవ్ చేసిన మరోనటిగా నెట్టింట పాపులర్ అయింది. తెలుగింట అంతే ఫేమస్ అయింది.
ఛాన్సులు మిస్ చేసుకుంటోందా:
సినిమాలో మెయిన్ లీడ్ రష్మికా మందన్నా పోషించినా? త్రిప్తీ పది నిమిషాలు కనిపించినా ఏపీ, తెలంగాణ థియేటర్లు ఓ రేంజ్లో దద్దరిల్లాయి. బోల్డ్ పెర్పార్మెన్స్ యువత ఫిదా అయింది. ఈసినిమా తర్వాత తెలు గింట అవకాశాలు ఖాయమనుకున్నారు. కానీ త్రిప్తీ కెరీర్ మాత్రం బాలీవుడ్ కే పరిమితమైనట్లు కనిపి స్తోంది. `యానిమల్` రిలీజ్ అయి రెండేళ్లు అవుతున్నా అమ్మడికి ఇంత వరకూ ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రాలేదా? అని అభిమానులు వేసుకుంటోన్న ప్రశ్న. సాధారణంగా ఇంతటి పాపులర్ బ్యూటీలు తెలుగు, దర్శక, నిర్మాతలు అంత ఈజీగా తీసుకోరు.
అభిమానుల్లో ఎన్నో సందేహాలు:
మా సినిమాలో నటించండని అడ్వాన్సులు పట్టుకుని తిరుగుతారు. కానీ త్రిప్తీ విషయంలో ఆ సన్నివేశం ఎక్కడా ఎదురవ్వలేదేంటని అభిమానులు బుర్రల్ని తొలి చేస్తోంది. టాలీవుడ్ ఆమెని లైట్ తీసుకుందా?; లేక ఆమె టాలీవుడ్ ని లైట్ తీసుకుందా? అంటున్నారు మరికొంత మంది. చాలా మంది బాలీవుడ్ నటీ మణులు తెలుగు సినిమా అవకాశాల కోసం క్యూలో ఉన్నారు. చిన్న సినిమాలో ఛాన్స్ వచ్చినా దూరిపో వాలని చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు.
అంచనాలు అందుకోని సినిమా:
కానీ త్రిప్తీలో ఆ మాత్రం కూడా కనిపించలేదు. ఇండస్ట్రీ పట్టించుకోలేదు. తాను పట్టించుకోలేదన్నట్లే సన్నివేశం కనిపిస్తోందన్నది ఇంకొంత మంది అభిప్రాయం. ప్రస్తుతం బాలీవుడ్ లో `రోమియో`లో నటి స్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా నత్తనడక సాగుతోంది. సెట్స్ కి వెళ్లి నెలలు గడుస్తోంది. కానీ ఇంత వరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదే ఏడాది `ధాకడ్ 2` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ రొమాంటిక్ డ్రామా అంచనాలు అందుకోలేకపోయింది.