ప్రభాస్‌తో సినిమా చేస్తూ... ఎన్టీఆర్‌పై ఇంట్రస్ట్
ఒకప్పుడు టాలీవుడ్‌ను, సౌత్ ఇండియన్ సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, బాలీవుడ్ స్టార్స్ చిన్న చూపు చూసేవారు.;
ఒకప్పుడు టాలీవుడ్‌ను, సౌత్ ఇండియన్ సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, బాలీవుడ్ స్టార్స్ చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ స్టార్స్‌ను మించి సౌత్ స్టార్స్ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. బాహుబలి వంటి సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి రెగ్యులర్‌గా వస్తున్నాయి. వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ వారు సైతం ఇక్కడ దృష్టి పెట్టారు. పైగా సౌత్ దర్శకులతో సినిమాలను చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ వంగ, అట్లీ, మురుగదాస్ వంటి దర్శకులకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. ఇంకా చాలా మంది హీరోలు సైతం అక్కడ మంచి బిజినెస్‌ను కలిగి ఉన్నారు. తెలుగు హీరోల్లో చాలా మంది బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్...
బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు సౌత్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు, సౌత్‌లో నటిస్తే తమ క్రేజ్ తగ్గుతుందని చాలా మంది భావించేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద హీరోలతో నటించిన వారు, అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ కూడా తెలుగులో నటించాలి అనుకుంటున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, ఆలియా భట్, శ్రద్దా కపూర్ వంటి స్టార్స్ సౌత్‌లో నటించిన విషయం తెల్సిందే. ఆ దారిలోనే మరికొందరు ముద్దుగుమ్మలు సౌత్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. త్రిప్తి డిమ్రి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.
స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి...
దీపికా పదుకునే నటించాల్సిన స్పిరిట్ లో అనుకోకుండా త్రిప్తి వచ్చి చేరింది. ఇటీవలే స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. స్పిరిట్ సినిమాలో త్రిప్తి పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఆమె నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తనకు టాలీవుడ్‌లో నటించడం ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో మీరు ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించిన సమయంలో ఆమె నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. ఎన్టీఆర్ యొక్క ఎనర్జీ తనకు ఇష్టం అని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తు ఉన్నాను అంది. ఎన్టీఆర్ తో కచ్చితంగా అవకాశం వస్తే సినిమాను చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్‌తో సినిమా కోసం తృప్తి..
ఇప్పటికే ప్రభాస్‌తో సినిమాను చేస్తుంది కనుక ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు చెప్పడంలో తప్పేం ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం గురించి అనవసర రాద్దాంతం అక్కర్లేదు అనిపిస్తోంది అంటూ కొందరు ఆమె సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పై ఆమెకు ఉన్న అభిమానంను ఆ వ్యాఖ్యలతో చెప్పింది. ఇంకా చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే విషయమై ఆసక్తి ఉందని కొందరు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ప్రస్తుతం సాధ్యం కాకున్నా భవిష్యత్తులో త్రిప్తి డిమ్రికి ఛాన్స్ ఇచ్చేనా చూడాలి. ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. స్పిరిట్ హిట్ అయ్యి, త్రిప్తికి మంచి పేరు వస్తే తప్పకుండా టాలీవుడ్‌లో మరింత మంది హీరోలతో ఈమె సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.