యానిమల్ బ్యూటీ అప్పుడే బోర్ కొట్టేసిందా..?

ఏడెనిమిది ఏళ్ల క్రితం మామ్, పోస్టర్ బోయ్స్ సినిమాలతో తెరంగేట్రం చేసింది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి.;

Update: 2025-04-26 03:00 GMT

ఏడెనిమిది ఏళ్ల క్రితం మామ్, పోస్టర్ బోయ్స్ సినిమాలతో తెరంగేట్రం చేసింది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి. కెరీర్ లో తనకు వచ్చిన అవకాశాలు చేస్తూ వచ్చింది. ఐతే ఎప్పుడైతే యానిమల్ సినిమా వచ్చిందో ఆ సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోయింది. అంతకుముందు త్రిప్తిని గుర్తు పట్టని వారు కూడా త్రిప్తి కనిపిస్తే చాలు ఫోటోల కోసం ఎగబడుతున్నారు. యానిమల్ సినిమా ఇచ్చిన ఐడెంటిటీ అంతా ఇంతా కాదు అంటూ త్రిప్తి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.

యానిమల్ క్రేజ్ తో త్రిప్తికి బాలీవుడ్ లో మరికొన్ని ఛాన్స్ లు వచ్చాయి. ఈ రెడేళ్లలో అమ్మడు హిందీలో నాలుగైదు సినిమాలు చేసింది. యానిమల్ సినిమాలో జోయా పాత్రలో త్రిప్తి ఆడియన్స్ ని మంత్రి ముగ్దుల్ని చేసింది. ఆ క్రేజ్ తో కొన్నేళ్ల పాటు బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తుందని అనుకున్నారు కానీ మూడు నాలుగు సినిమాలకే అమ్మడి పని అయిపోయింది.

లాస్ట్ ఇయర్ త్రిప్తి బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో, భూమ్ భూలియా 3 సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో కూడా త్రిప్తి గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది. కానీ యానిమల్ లో వచ్చిన క్రేజ్ మాత్రం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం అమ్మడు దఢక్ 2 తో పాటు మరో సినిమా చేస్తుంది. ఈ సినిమాల మీదే తన హోప్స్ అన్నీ పెట్టుకుంది త్రిప్తి డిమ్రి.

యానిమల్ టైం లో సౌత్ నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి త్రిప్తికి ఆఫర్లు రావడం ఖాయమని అనుకున్నారు. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా డిస్కషన్స్ కూడా జరిగాయని టాక్. ఐతే త్రిప్తి తెలుగు ఎంట్రీ ఇవ్వకముందే మళ్లీ కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 3 సినిమాల్లో నటించినా అమ్మడు ఎలాంటి ప్రభావం చూపించకపోయే సరికి త్రిప్తి అప్పుడే బోర్ కొట్టేసిందా అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అందాల భామకి మళ్లీ యానిమల్ లాంటి సినిమా పడితే మాత్రం తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. త్రిప్తి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం అమ్మడికి ఇక్కడ మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆమధ్య విజయ్ దేవరకొండ సినిమాలో త్రిప్తి నటిస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి కానీ వాటిలో వాస్తవం లేదని తెలుస్తుంది.

Tags:    

Similar News