చెప్పుతో ఎందుకు కొట్టుకున్నానంటే? : బార్బరిక్ దర్శకుడు

టాలీవుడ్ లేటెస్ట్ సినిమా త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవాత్స ఇటీవల భావోద్వేగానికి గురైన విషయం తెలిసింది.;

Update: 2025-09-02 16:33 GMT

టాలీవుడ్ లేటెస్ట్ సినిమా త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవాత్స ఇటీవల భావోద్వేగానికి గురైన విషయం తెలిసింది. తాను రెండేళ్లు ఎంతో కష్టపడి ఈ సినిమా తెరకెక్కిస్తే, మంచి టాక్ ఉన్నా థియేటర్లకు జనాలు రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఆయన ఎందుకు అలా చేశారని నెటిజన్లు చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఆయన అలా ఎందుకు చేశారో తాజాగా చెప్పుకొచ్చారు. దాని వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.

ప్రేక్షకులు థియేటర్ కు రావాలి అంటే.. క్వాలిటీ సినిమా కావాలి. మేకింగ్ అద్భుతంగా ఉండాలి. కొత్త కంటెంట్ కావాలి. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను, మా నిర్మాత అద్భుతంగా సినిమా తెరకెక్కించాం. అయితే థియేటర్ కు కనీసం 30- 40 మంది షో కు వెళ్తే.. దాని టాక్ బయటకు వస్తుంది. అంతకంటే తక్కువ ప్రేక్షకులు ఉంటే షో క్యాన్సిల్ చేస్తారు. అలాంటిది నేను థియేటర్ కు వెళ్లేసరికి 10 మందే ఉన్నారు. అందుకే నేనే రెండు టికెట్లు కొని షో చూశాను.

మిగిలిన వాళ్ల టాక్ తెలుసుకుందామని వెళ్లాను. వాల్లకు నేను డైరెక్టర్ అని చెప్పకుండా టాక్ అడిగా. సినిమా బాగుంది. అద్బుతంగా తీశారు. కానీ, ప్రేక్షకులు ఎందుకు రావడం లేదో అర్థం అవ్వడం లేదు. అని అన్నారు. వెంటనే వాళ్లకు నేనే డైరెక్టర్ అని చెప్పాను. వాళ్ల నన్ను హగ్ చేసుకొని సినిమా బాగుందని అన్నారు. ఇక పక్కన ఉన్న మరో స్క్రీన్ కు వెళ్లి చూసా. అందులో మలయాళం సినిమా ఆడుతుంది. అందులో 90 శాతం జనాలు ఉన్నారు.

మరి మనం ఏం తప్పు చేశాం. మన సినిమా బాగుందా? లేదా అనేది చెప్పాలన్నా ఎక్కువ మంది సినిమా చూడాలి. 5 -6 మందితో సినిమా జనాల్లోకి ఎలా వెళ్తుంది. రెండేళ్లు కష్టపడి సినిమా చేస్తే, ఈ రెస్పాన్స్ రావడంతో నేను ఏమైనా చేసుకుంటానని మా భార్య కూడా సినిమా మధ్యలోంచి వచ్చేసింది.

మలయాళ సినిమాకు ఆక్యుపెన్సీ బాగుంది. మరి నా సినిమాకు ఎందుకు ఇలాంటి రెస్పాన్స్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడే నా కళ్లలోంచి నీళ్లు వచ్చాయి. మా భార్యతో మాట్లాడాక.. ఇంకా ఎమోషనల్ అయ్యాను. దీంతో అలా చెప్పుతో కొట్టుకున్నా. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి.. మనం ఏం తప్పు చేయలేదు. మంచి సినిమా చేశాం. నువ్వు కష్టపడ్డావు. కానీ జనాలు రాకపోతే నువ్వు ఏం చేస్తావు? డిలీట్ చేసెయ్ అన్నారు. కానీ అది అప్పటికే వైరల్ అయిపోయింది. అని వివరణ ఇచ్చారు.

కాగా, మోహన్ శ్రీవాత్స తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ ఆగస్టు 29న గ్రాండ్ గా రిలీజైంది. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రేక్షుకులు, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితే తక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవ్వడంతో దర్శకుడు ఇటీవల ఎమోషనల్ అయ్యారు.

Tags:    

Similar News