• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ఆసక్తికరంగా...

ట్రైలర్ టాక్: ఆసక్తికరంగా నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'..!

| ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

By - Tupaki Desk
Update: 2024-11-04 12:55 GMT

నిఖిల్ సిద్దార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో''. ఇందులో రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

ఫార్మూల వ‌న్ రేసర్ అవ్వాలని కలలు గనే రిషి పాత్రలో నిఖిల్ ను పరిచయం చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. అతని కల నిజమయ్యే వరకూ బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి ప్లేబాయ్ గా మారినట్లు చూపించారు. రిషి ముందుగా ఐ లవ్ యూ అంటూ తార (రుక్మిణి వసంత్) అనే అమ్మాయిని ప్రేమలోకి దింపి, ఆమె మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తులసి (దివ్యాంశ కౌశిక్) ని కూడా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట తిరుగుతున్నాడు.

రిషి డబ్బు కోసమే ఇద్దరు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడిపినట్లు తెలుస్తోంది. అయితే ‘ఆ డబ్బులు సరిపోక పార్ట్ టైమ్ కూడా ప్లాన్ చేసుకున్నాడు’ అని కమెడియన్ సత్య వాయిస్ తో చెప్తుండగా.. నిఖిల్ తన ఫ్రెండ్ వైవా హర్షతో కలిసి ఒక శవాన్ని తీసుకెళ్తూ ఏదో మర్డర్ ప్లాన్‌లో భాగమైనట్లు చూపించారు. అలాంటి పరిస్థితుల్లో విలన్ గ్యాంగ్ వాళ్లిద్దరినీ బంధించి, ఏదో డివైజ్ కోసం ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు ఆ డివైజ్ గురించే వాళ్ళకి ఏమీ తెలియదని అర్థమవుతోంది. ఓవైపు పోలీసులు, మరోవైపు రౌడీ గ్యాంగ్ వెంటపడటంతో అసలైన ఛేజింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

''ప్రతీవాడు నా లైఫ్‌తో గేమ్ ఆడేసుకుంటూ ఉంటే, నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ల గేమ్ వాళ్లకంటే నేను బాగా ఆడడం మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను'' అంటూ నిఖిల్ తన గేమ్ స్టార్ట్ చేసినట్లు ట్రైలర్ లో చూపించారు. అయితే చివర్లో రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ ఇద్దరూ ఒకచోట చేరినప్పుడు నిఖిల్ చీటింగ్ చేసాడనే విషయం బయటపడినట్లు అర్థమవుతోంది. ఇద్దరిలో అతను నిజంగా ఎవరిని ప్రేమించాడు? ఎవరిని మోసం చేసాడు? పోలీసులు, రౌడీల నుంచి ఎలా భయటపడ్డాడు? అసలు ఆ డివైజ్ ఏంటి? అనేది తెలియాలంటే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా చూడాల్సిందే.

ఇటీవల కాలంలో వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న నిఖిల్.. ఈసారి డిఫెరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనేది సుధీర్ వర్మ మార్క్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో నిఖిల్ ఎప్పటిలాగే మంచి ఈజ్ తో నటించాడు. హీరోయిన్లు ఇద్దరూ అందంగా కనిపించారు. వైవా హర్ష, సత్య, సుదర్శన్ నవ్వించే పాత్రలు పోషించారు. అజయ్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఫారిన్ లోనే జరిగింది.

ఓవరాల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సన్నీ ఎంఆర్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా బీజీఎమ్ అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేసారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘స్వామిరారా’, ‘కేశవ’ తర్వాత నిఖిల్ - సుధీర్ వర్మ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Full View
Tags:    
  • Appudoippudoeppudo 
  • Nikhil 
  • Rukminivasanth 
  • Divyansha 
  • SudheerVarma 
  • SVCC 
  • Tollywood 
  • Trailertalk 

Similar News

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

2026-11-18 05:48 GMT

ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!

2026-11-18 05:46 GMT

వారణాసి.. అలాంటి సర్‌ప్రైజ్ ఒక్కటి పడినా..

2026-11-18 05:43 GMT

మూడోసారి తల్లి అయిన నటి.. మామ్ అయితేనే క్రేజ్ ఎక్కువా?

2026-11-18 05:43 GMT

నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌

2026-11-18 05:42 GMT

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

2026-11-18 03:37 GMT

“రామ్ చరణ్ నన్ను అన్నా అంటారు.. అఖిల్ చిరుని పెదనాన్న అంటారు..”

2026-11-18 03:36 GMT

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

2026-11-18 03:36 GMT

ఈఎన్‌ఈ రిపీట్ USA థియేటర్స్ లిస్ట్

2026-11-18 03:08 GMT

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

Copyright @2026

Powered by Blink CMS