రికార్డు సృష్టించిన రాయా.. 24 గంటల్లోనే..
క్రిటికల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తాజాగా తొలిసారి కమర్షియల్ సినిమా చేస్తోంది.;
క్రిటికల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తాజాగా తొలిసారి కమర్షియల్ సినిమా చేస్తోంది. అదే టాక్సిక్. ఈ చిత్రంలో కేజిఎఫ్ 1 & 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న యష్ హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులో నటిస్తున్న నటీనటుల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.
అయితే నిన్న హీరో యష్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న వీడియోని మేకర్స్ విడుదల చేశారు. అలా టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన హీరో ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తోంది. వీడియో వచ్చిన 24 గంటల్లోనే ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడమే కాకుండా 5.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ తో సహా విడుదల చేశారు.2:52 నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ సీన్ ఆకట్టుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నుండి విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా మరొకసారి గీతూ మోహన్ దాస్ దర్శకత్వ విలువలు తెలుస్తున్నాయి అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
మార్చ్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా భాష లైన కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ తో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోంది. ఇక నిన్న విడుదల చేసిన ఈ వీడియోని కూడా ఇంగ్లీషులో రిలీజ్ చేయడం గమనార్హం. మొత్తానికైతే యష్ ఇందులో ఆడియన్స్ కి కావలసిన ఫుల్ మాస్ యాక్షన్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోబోతున్నారని నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని ట్యాగ్ లైన్ తో గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట కే నారాయణ, యష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రాయా అనే పాత్రలో హీరో నటిస్తున్నట్లు నిన్న ప్రకటించారు. మెల్లిసాగా రుక్మిణి వసంత్, నదియా పాత్రలో కియారా అద్వానీ, గంగా పాత్రలో నయనతార, రెబెక్క పాత్రలో తారా సుతారియా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వీరితోపాటు అక్షయ్ ఒబెరాయ్, నటాలీ బర్న్, ఉదయ్ కుమార్ రెడ్డి, కైల్ పాల్ , టోవినో థామస్ , అమిత్ తివారీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.