కరీనా నో అంటే నయనతార యస్.. 'టాక్సిక్'లో ఆసక్తికర ట్విస్ట్!

కరీనా కపూర్ నో చెప్పడంతో ఆ శక్తివంతమైన గంగా పాత్ర కోసం దర్శకురాలు గీతు మోహన్ దాస్ లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారు.

Update: 2026-08-22 10:30 GMT

రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ 2 వంటి భారీ విజయం తర్వాత నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాలో యశ్ అక్క 'గంగా' పాత్ర విషయంలో ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మొదట బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్‌ను ఎంపిక చేయగా, కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ పవర్‌ఫుల్ రోల్ నయనతార వద్దకు చేరింది అని కరీనా సోషల్ మీడియా వేదికగా తెలిపారు..

కరీనా నో చెప్పడానికి అసలు కారణం:

1980ల పీరియాడిక్ డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యశ్ అక్క పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది. ఇక ఈ పాత్ర ద్వారా కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కరీనా కపూర్ ఎంతో ఆసక్తి చూపించారు. అయితే షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ఇతర కమిట్‌మెంట్లతో డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల కరీనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. మరోవైపు యశ్ సరసన సిస్టర్ రోల్ చేయడానికి కరీనా నిరాకరించారనే టాక్ కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్:

కరీనా కపూర్ నో చెప్పడంతో ఆ శక్తివంతమైన గంగా పాత్ర కోసం దర్శకురాలు గీతు మోహన్ దాస్ లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారు. కథ, తన క్యారెక్టర్ ఇంపాక్ట్ నచ్చడంతో నయనతార వెంటనే ఓకే చెప్పేశారు. దక్షిణాదిలో అపారమైన క్రేజ్ ఉన్న నయనతార చేరికతో ఈ సినిమాకు మైలేజ్ మరింత పెరిగింది. ఇక యశ్, నయనతారల కాంబినేషన్‌లో వచ్చే ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

అగస్టు 26న పాన్ ఇండియా విడుదల:

భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భామలు నటిస్తున్నారు. ఇక యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇక విడుదల తేది దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చితా యూనిట్..

ఇక ఏది ఏమైనా, కరీనా కపూర్ నో చెప్పడం వల్ల దక్కిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ను నయనతార ఏ స్థాయిలో ఉపయోగించుకున్నారో చూడాలి. 'కేజీఎఫ్ 2' తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో వస్తున్న యశ్, ఈ డార్క్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News