స్టార్ డైరెక్టర్లందరికీ వీళ్లే కావాలా?
కోలీవుడ్ సంచలనం అనిరద్ రవిచందర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అనిరుద్ అన్ని భాషల్ని దున్నేస్తున్నాడు.;
ఇండస్ట్రీలో ఫాంలో ఉన్న వాళ్లవైపే అంతా చూసేది. అది దర్శకుడి విభాగంలో అయినా? హీరో విభాగంలో అయినా? ఎవరైనా సక్సస్ ల్లో ఉన్న వారివైపే చూస్తారు. వాళ్లకే అవకాశాలు కల్పిస్తారు. మళ్లీ మళ్లీ వాళ్లతోనే కలిసి పనిచేయాలనుకుంటారు. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం పుల్ ఫామ్ లో నలుగు రైదు గురు మ్యూజిక్ డైరెక్టర్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లు అంతా వాళ్లనే తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లుగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...
కోలీవుడ్ సంచలనం అనిరద్ రవిచందర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అనిరుద్ అన్ని భాషల్ని దున్నేస్తున్నాడు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, ఇంగ్లీష్ అంటూ అన్ని భాషల్లోనూ పని చేస్తున్నాడు. 'జైలర్ 2', 'ప్యారడైజ', బాలీవుడ్ 'కింగ్' చిత్రాలకు తానే సంగీతం అందిస్తు న్నాడు. ఈ సినిమాలకు గానూ భారీగా పారితోషికం తీసుకుంటున్నాడు. తమన్ కూడా ఇంతే బిజీగా ఉన్నా డు. అన్ని భాషల్లోనూ సంగీతం అందిస్తున్నాడు.
'ఓజీ', 'అఖండ-2' ,'తెలుసు కదా', 'దిరాజాసాబ్' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఓ తమిళ సినిమాకు బాణీలు సమకూర్చుతున్నాడు. అనిరుద్ కంటే పారితోషికం పరంగా తక్కువే కావడంతో మేకర్స్ థమన్ వైపు ఎక్కువగా మెగ్గు చూపుతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆ మధ్య స్పీడ్ తగ్గినట్లు కనిపిం చినా? మళ్లీ బిజీ అయిపోయాడు. 'పుష్ప'తో పాన్ ఇండియాలో సంచనలమవ్వడంతో అవకాశాలు పెరిగాయి. ఇటీవలే 'తండేల్', 'కుబేర' చిత్రాలను మ్యూజికల్ గా మంచి హిట్ చేసాడు. ప్రస్తుతం 'జూనియర్', 'వృషభ' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.
వీటితో పాటు కొన్ని కొత్త కమిట్ మెంట్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్యనే భీమ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్ స్క్వేర్ ','సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలతో తెలుగు ఆడి యన్స్ బాగా కనెక్ట్ అయ్యాడు. `గోదారి గట్టు మీద రామ సిలక` పాటతో మాస్ లో సంచలనంగా మారాడు. దీంతో చిరంజీవి 'విశ్వంభర'లో ఐటం సాంగ్ బాద్యత భీమ్స్ కే అప్పగించారు. అలాగే 157వ సినిమా కు పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగాను తీసుకున్నారు. ప్రస్తుతం `డెకాయిట్`, `మాస్ జాతర` చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. సక్సస్ ల్లో ఉన్న దర్శకులంతా తమ సినిమాలకు వీళ్లే సంగీత దర్శకులుగా పనిచేయాలని కోరుకుంటున్నారు.