MIB: టాలీవుడ్‌ లో టాప్.. మరి సౌత్‌ లో?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం రేర్ గా కనిపిస్తుంది. అలాంటి సమయంలో రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

Update: 2026-07-07 19:30 GMT

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం రేర్ గా కనిపిస్తుంది. అలాంటి సమయంలో రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్‌ లో లేడీ లీడ్ సినిమాలకు కొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేసిన ఆ మూవీ.. ఇప్పుడు సౌత్ లో టాప్-2లో నిలిచి మరో అరుదైన ఘనతను అందుకోవడం విశేషం.

జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ సాధించింది. తర్వాత విడుదలైన సినిమాల పోటీ ఉన్నప్పటికీ కలెక్షన్లలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాలిడ్ గా వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.93 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఆ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆ విజయంతో టాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా మా ఇంటి బంగారం మూవీ రికార్డు సృష్టించింది. మహానటి, అరుంధతి సినిమాల బాక్సాఫీస్ లైఫ్‌ టైమ్ వసూళ్లను డామినేట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు.. సమంత కెరీర్‌ లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కూడా ఇది నిలిచింది. సౌత్ ఇండియన్ ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో మాత్రం మా ఇంటి బంగారం రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ లిస్ట్ ను ఓ సారి చూసుకుంటే..

లోక (మలయాళం)- రూ.300 కోట్ల వసూళ్లు

మా ఇంటి బంగారం- రూ.93 కోట్లు

మహానటి- రూ.84 కోట్లు

రుద్రమదేవి- రూ.81 కోట్లు

అరుంధతి- రూ.70 కోట్లు

భాగమతి- రూ.63 కోట్లు

సూక్ష్మదర్శిని (మలయాళం)- రూ.54 కోట్లు

అమెరికాలో కూడా మా ఇంటి బంగారం సినిమా మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు నుంచి లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ తో తెరకెక్కిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెలుస్తోంది. అదే సమయంలో లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ తో రూపొందిన సినిమాలకు కూడా సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు భారీగా ఆదరిస్తారనే విషయాన్ని మా ఇంటి బంగారం మూవీ మరోసారి ప్రూవ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక మూవీ విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మా ఇంటి బంగారం చిత్రంలో ప్రియదర్శి, దిగంత్, రామకృష్ణ, గుల్షన్ దేవయ్య, రాహుల్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఆ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న మా ఇంటి బంగారం మూవీ జోరును బట్టి చూస్తే.. రూ.100 కోట్ల మైలురాయిని చేరుకోవడం మాత్రమే కాకుండా మరిన్ని రికార్డులు కూడా సినిమా ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో ఎంతటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News