• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ కు అంత...

టాలీవుడ్ కు అంత భయమెందుకు?

| సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. అయితే జనవరి 26న రిపబ్లిక్ డే ఉంది.

By - Tupaki Desk
Update: 2024-01-02 16:09 GMT

ఈ మధ్యకాలంలో రిలీజ్ డేట్ విషయంలో కాంపిటేషన్ ఎక్కువ అవుతుంది. ఒకే డేట్ కోసం మూడు, నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే మంచి ఛాన్స్ ఉన్న డేట్స్ మాత్రం వదిలేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. అయితే జనవరి 26న రిపబ్లిక్ డే ఉంది.

గత ఏడాది అదే డేట్ కి వచ్చిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో జనవరి 26 డేట్ కి మంచి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ రోజు ఈ రిపబ్లిక్ డే పడటం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే తెలుగు నిర్మాతలు సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి ఏ ఇతర సీజన్, ఫెస్టివల్ కి ఇవ్వరు.

అందుకే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా అదే టైంలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని అనుకుంటారు. నిర్మాతలు కూడా సంక్రాంతి సీజన్ ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. కంటెంట్ ఏవరేజ్ గా ఉన్న కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందని భావిస్తారు. ఈ జనవరి 26 రిపబ్లిక్ డే శుక్రవారం పడుతుంది. కానీ ఆ రోజున ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కి లేదు.

జనవరి 26న రెండు తెలుగు సినిమాలు రిలీజ్ ని గతంలో ఎనౌన్స్ చేశారు. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం సీక్వెల్ శపథం రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా వ్యూహం రిలీజ్ కి నోచుకోలేదు. కాబట్టి శపథం ఆ డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఇక నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతినిధి 2 మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పారు. టీవీ5 న్యూస్ యాంకర్ మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పట్లో ఈ మూవీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

దీంతో తెలుగు సినిమాలు ఏవీ కూడా రిపబ్లిక్ డేకి రిలీజ్ కావడం లేదు. అయితే తమిళంలో రజినీకాంత్ కీలక పాత్రలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లాల్ సలామ్ రిలీజ్ అవుతోంది. అలాగే హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ ఈ రేంజ్ లో రిలీజ్ అవుతోంది. అలాగే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 19న రిలీజ్ కానుంది. ఈ డేట్ వాయిదా పడితే జనవరి 26కి వచ్చే అవకాశం ఉందంట. మొత్తానికి రిపబ్లిక్ డే రోజున మొత్తం డబ్బింగ్ సినిమాలే తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నాయని తెలుస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Movie 
  • Releases 
  • Sankranti 
  • Festivalseason 
  • Republicday 
  • Rgv 
  • Nararohith 
  • Filmindustry 

Similar News

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS