ధమాకా హీరోకే ధమ్కీ ఇచ్చిన శ్రీ లీల?
టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న అందాల భామ శ్రీలీల.;
టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న అందాల భామ శ్రీలీల. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజను వరకు సినిమాలు ఉన్నాయి. వాటిలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలాంటివి కూడా ఉన్నాయి. ఓ వైపు టైర్ 2 హీరోలతో మూవీస్ చేస్తూనే మరో వైపు స్టార్ హీరోలకి కూడా జోడీగా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజతో చేసిన ధమాకా మూవీ తర్వాత శ్రీలీల రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
అయితే మినిమం రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ శ్రీలీలనే హీరోయిన్ గా కావాలని డిమాండ్ చేస్తూ ఉండటం విశేషం. కాని వరుస ప్రాజెక్ట్స్ కారణంగా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. రామ్ పోతినేనికి జోడీగా శ్రీలీల నటించిన స్కంద మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. స్కంద హిట్ అయితే శ్రీలీలకి ఇంకా డిమాండ్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీ వినిపిస్తోన్న టాక్ ప్రకారం శ్రీలీల ఇప్పటికే నితిన్, వెంకీ కుడుమల కాంబోలో సినిమా చేయడానికి ఒకే చెప్పింది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తాజాగా మరో సినిమా నుంచి కూడా శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమాని చేస్తున్నారు.
డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వలన ఈ చిత్రం నుంచి కూడా తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా మాత్రం దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని సోషల్ మీడియాలో జోరుగా ఈ విషయం ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ క్రేజీ హీరోయిన్ గా శ్రీలీలకి వరుస అవకాశాలు రావడంతో వాటిని ముందుగా కమిట్ అయిన ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్ క్లాసెస్ రావడం వదులుకోవాల్సి వస్తోంది.
మరో వైపు ఈ బ్యూటీ మెడికల్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతోంది. వీటి కోసం ఓ రెండు నెలలు గ్యాప్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలోనే కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇది కూడా ఆమె ప్రాజెక్ట్స్ వదులుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.