కొట్లో అప్పుపెట్టిన మెగా హీరోలు.. ఇదెక్కడి విడ్డూరం!
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ఆ కుటుంభం నుండి వచ్చిన ప్రతి హీరోను ఆదరిస్తున్నారు.;
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ఆ కుటుంభం నుండి వచ్చిన ప్రతి హీరోను ఆదరిస్తున్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు కూడా సామాన్యుల్లాగే అప్పులు చేస్తారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు సీనియర్ నటుడు నరేష్. సుహాస్ హీరోగా నటించిన 'హే భగవాన్' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన పంచుకున్న కొన్ని పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా హీరో సాయి దుర్గ తేజ్ గురించి ఆయన చెప్పిన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే ..
కోక్ కోసం కొట్లో అప్పు!:
ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.. సాయి దుర్గ తేజ్, తన కుమారుడు నవీన్ విజయకృష్ణ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులని తెలిపారు. అయితే, అసలు విషయం ఏమిటంటే.. వీళ్లిద్దరూ కలిసి రోజూ దగ్గరలోని ఒక షాప్ కి వెళ్లి అరువు మీద కోక్ తాగేసేవారట. మీకు తెలుసా? ఇలా రోజురోజుకీ అప్పు పెరిగిపోవడంతో, ఒకానొక దశలో ఆ షాప్ యజమాని "బాబు మీ అప్పు ఎక్కువైపోయింది, ఇక మీకు అరువు ఇవ్వలేను" అని తెగేసి చెప్పేశాడట. అప్పట్లో కోక్ 12 రూపాయలు అని,పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇక మెగా వారసులైనా సరే, ఆ వయసులో వారి అల్లరి, ఆ స్నేహం అలా ఉండేదని,ఇప్పటికి వారు అలాగే మంచి ఫ్రెండ్స్ లా వున్నారు అని నరేష్ తెలిపారు.
సాయి దుర్గ తేజ్ ఒక ఫైటర్:
సాయి దుర్గ తేజ్ కేవలం ఒక నటుడే కాదు, వ్యక్తిగతంగా ఒక గొప్ప మనిషి అని నరేష్ కొనియాడారు. అసలు విషయం ఏమిటంటే, గతంలో జరిగిన ప్రమాదం నుండి ఆయన కోలుకున్న తీరు, ఆయన పట్టుదల చూస్తే ఆయనో నిజమైన 'ఫైటర్' అనిపిస్తుందని నరేష్ ప్రశంసల వర్షం కురిపించారు.
'హే భగవాన్' లో నవ్వుల జాతర:
ఇకపోతే, ఫిబ్రవరి 20న విడుదల కానున్న 'హే భగవాన్' సినిమాలో నరేష్ ఒక కీలక పాత్ర పోషించారు. సుహాస్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుదర్శన్ కామెడీ కూడా హైలైట్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'కలర్ ఫోటో' సుహాస్ మరోసారి తన నటనతో థియేటర్లను నవ్వించడానికి సిద్ధమయ్యారు.
పెద్ద పెద్ద హీరోల వెనుక కూడా మనలాంటి సామాన్యమైన, సరదా జ్ఞాపకాలు ఉంటాయని నరేష్ మాటలు నిరూపిస్తున్నాయి. మెగా అభిమానులకు ఈ వార్త ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సుహాస్ సినిమా 'హే భగవాన్' ఫిబ్రవరి నెల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు లను క్రియేట్ చేస్తుందో చూడాలి..