కోలీవుడ్‌కు ఒక‌రు.. టాలీవుడ్ కు న‌లుగురు

సీనియ‌ర్ స్టార్ హీరోల విష‌యంలో తెలుగు సినిమా త‌మిళ సినిమా కంటే చాలా ముందుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.;

Update: 2025-06-07 03:00 GMT

సీనియ‌ర్ స్టార్ హీరోల విష‌యంలో తెలుగు సినిమా త‌మిళ సినిమా కంటే చాలా ముందుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. తెలుగు సినీయర్ హీరోలు ప‌లు అంశాల‌ను క‌వ‌ర్ చేసి సినిమాలు చేస్తూ త‌మిళ సీనియ‌ర్ హీరోల కంటే చాలా ముందున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఇటీవ‌ల హీరోగా నాగార్జున సినిమాలు చేయ‌డం త‌గ్గించాడు కానీ మిగిలిన ముగ్గురు మాత్రం నిల‌క‌డ‌గా సినిమాలు చేస్తూ రాణిస్తూనే ఉన్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలే ఉన్నారు. వారే ర‌జినీకాంత్ మ‌రియు క‌మ‌ల్ హాస‌న్. అప్పుడ‌ప్పుడు బ్రేక్స్ ఉన్న‌ప్ప‌టికీ వారిలో ర‌జినీకాంత్ మాత్ర‌మే కొంచెం క్వాలిటీ సినిమాల‌ను తీస్తూ ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ మాత్రం త‌న సినిమాల‌తో ఆడియ‌న్స్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ ను క‌లిగించ‌లేక‌పోతున్నారు. విక్ర‌మ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడ‌నుకుంటే ఆ త‌ర్వాత మ‌రో హిట్ కొట్ట‌డానికి క‌మ‌ల్ ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇండియ‌న్2 సినిమా త‌మిళ మార్కెట్ లో డిజాస్ట‌ర్ ఓపెన‌ర్ గా నిల‌వడంతో పాటూ ఆ సినిమా కోలీవుడ్ లో ఆల్ టైమ్ డిజాస్ట‌ర్ గా కూడా పేరు తెచ్చుకుంది.

రీసెంట్ గా మ‌ణిర‌త్నంతో క‌లిసి చేసిన థ‌గ్ లైఫ్ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఓ వైపు ర‌జినీకాంత్ ఏదొక విధంగా కొత్త‌ద‌నం ట్రై చేసి ఆడియ‌న్స్ ను మెప్పిస్తూ వ‌స్తుంటే, క‌మ‌ల్ మాత్రం ఏం చేసినా ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయ‌లేక‌పోతున్నారు. దీంతో కోలీవుడ్ లో సీనియ‌ర్ స్టార్ గా మిలిగిన ఏకైక హీరోగా ర‌జినీకాంత్ ఉన్నారు. తెలుగులో న‌లుగురు సీనియ‌ర్ హీరోలుంటే త‌మిళ ఇండ‌స్ట్రీ, కోలీవుడ్ ఆడియ‌న్స్ మాత్రం ఒకే ఒక సీనియ‌ర్ హీరోతో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంది.

Tags:    

Similar News