దిల్ రాజు, సురేష్ బాబు.. ఇప్పటికే లేటైంది సారూ!!

రీసెంట్ గా ఎగ్జిబిటర్స్.. థియేటర్స్ ను క్లోజ్ చేస్తామని ప్రకటించారు. పర్సంటేజ్ విధానంలో మూవీలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.;

Update: 2025-05-26 09:02 GMT

'తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఆ నలుగురు చేతిల్లోనే ఉంది'.. కొద్ది రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అనేక మంది నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నలుగురు వల్ల టాలీవుడ్ లో ఇటీవల పరిణామాలు నెలకొన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రీసెంట్ గా ఎగ్జిబిటర్స్.. థియేటర్స్ ను క్లోజ్ చేస్తామని ప్రకటించారు. పర్సంటేజ్ విధానంలో మూవీలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఇంతలోనే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమా సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞత లేదని తీవ్రంగా మండిపడ్డారు.

ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది అవుతున్నా.. సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందే థియేటర్స్ బంద్ అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఆ నలుగురు వల్లే అలా జరిగిందని ఆరోపిస్తున్నారు.

అయితే ఆ నలుగురిలో తాను లేనని రీసెంట్ గా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ మూవీ రిలీజ్ ముందే థియేటర్స్ మూస్తామని చెప్పడం దుస్సాహసంగా వర్ణించారు. తనకు ఉన్న థియేటర్స్.. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 15 అని తెలిపారు. అవి కూడా డీల్ అయ్యాక రెన్యువల్ చేయొద్దని ఇప్పటికే తన స్టాఫ్ కు చెప్పినట్లు వెల్లడించారు.

ఇటీవల జరిగిన సంఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రీసెంట్ గా జరిగిన మీటింగ్స్ కు హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, అల్లు అరవింద్ కామెంట్స్ సమంజసంగానే ఉన్నాయి. ఆ నలుగురిలో ఆయన లేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్ చుట్టూ వేళ్లు చూపిస్తున్నాయి.

ఎందుకంటే వారి ముగ్గురికి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ ఉన్న విషయం తెలిసిందే. వారిది బిగ్ నెట్ వర్క్. దీంతో వారు ముగ్గురు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారిపై బిజినెస్ పై ఎఫెక్ట్ పడకముందే స్పందించాలని, ఇప్పటికే లేట్ అయిందని అంటున్నారు. మరి దిల్ రాజు, సురేష్ బాబు సహా పలువురు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News