టైర్ వన్ హీరోలు సాధించిన ఇండస్ట్రీ హిట్లు ఇవే... ఎవరెన్ని సార్లు రికార్డు బ్రేక్ చేశారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ గత దశాబ్ద కాలంగా హద్దులన్నింటిని చెరిపేస్తూ గ్లోబల్ మార్కెట్ వైపు దూసుకెళ్తుంది.

Update: 2026-10-19 17:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ గత దశాబ్ద కాలంగా హద్దులన్నింటిని చెరిపేస్తూ గ్లోబల్ మార్కెట్ వైపు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు ప్రాంతీయ కథలతో కాకుండా నేషనల్ ప్రేక్షకులందరిని అలరించే స్టోరీ తో సినిమాలను చేస్తున్నారు. ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ లో నెంబర్ వన్ ఎవరు అనే దానిమీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎక్కువ సంఖ్య లో ఇండస్ట్రీ హిట్లను సాధించి మార్కెట్ ను విస్తృతంగా పెంచుకున్న హీరోలు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకుంటారు. ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఎన్ని ఇండస్ట్రీ హిట్ల ను దక్కించుకున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఖుషి సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా మారిపోయాడు... ఖుషి మూవీ ఆ రోజుల్లోనే 25 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అత్తారింటికి దారేది

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిపారు. మొత్తానికైతే ఈ సినిమాతో త్రివిక్రమ్ మొదటి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం తన కెరీర్ లో రెండో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేయడం విశేషం...ఈ సినిమా దాదాపు 85 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది... అంతకు ముందు 'మగధీర' పేరు మీద ఉన్న ఇండస్ట్రీ రికార్డ్ ని అత్తారింటికి దారేది మూవీ 85 కోట్ల కలెక్షన్స్ తో బ్రేక్ చేయడం విశేషం...

మహేష్ బాబు

'రాజకుమారుడు' సినిమాతో సినీ కెరియర్ ను స్టార్ట్ చేసిన మహేష్ బాబు ఆ తర్వాత చేసిన సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కడు మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. పోకిరి సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవడం విశేషం... 50 కోట్ల కలెక్షన్స్ ను సాధించిన మొదటి తెలుగు సినిమాగా పోకిరి రికార్డును క్రియేట్ చేసింది...

శ్రీమంతుడు

మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా శ్రీమంతుడు నిలిచింది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయడమే కాకుండా ఈ సినిమా దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది...

రామ్ చరణ్

మగధీర సినిమాతో వారియర్ గా నటించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. 80 కోట్లతో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకోవడం విశేషం...

రంగస్థలం

సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ 125 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ మూవీలో రామ్ చరణ్ కనబర్చిన నటనకి చరణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఇంప్రెస్ అయ్యారు...

ప్రభాస్

'వర్షం' మూవీతో మొదటి సక్సెస్ ను అందుకున్న ప్రభాస్ బాహుబలి తో మొదటి పార్ట్ తో ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. ఈ మూవీలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంశలు దక్కాయి. రాజమౌళి విజన్ కి రూపమిచ్చిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రూవ్ చేసిన మూవీ 'బాహుబలి' నే కావడం విశేషం...

బాహుబలి 2

మొదటి పార్ట్ కి వచ్చిన హైప్ తో రెండో పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఇండియా వైడ్ గా ఈ మూవీకి గొప్ప క్రేజ్ వచ్చింది. ఫైనల్ గా 1800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రాజమౌళి అంటే పేరు కాదు బ్రాండ్ అని ప్రూవ్ అయింది.

ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలను చేశాడు. కొన్ని మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ ను సాధించాడు. సింహాద్రి మూవీ తో ఫస్ట్ ఇండస్ట్రీ కొట్టాడు.

అల్లు అర్జున్

'ఆర్య' మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తరువాత డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన 'అలా వైకుంఠపురం లో' సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు...

పుష్ప 2 :

పుష్ప మొదటి పార్ట్ లో హీరోకి జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ తను సిండికేట్ లీడర్ గా మారడం సినిమాలో హై ఓల్టేజ్ సన్నివేశాలు ఉండటం తో ఈ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ మూవీ 1850 కోట్ల కలెక్షన్స్ ను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది...

ఇప్పటి వరకు టైర్ వన్ హీరోలందరు వాళ్ల కెరియర్ లో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఇండస్ట్రీ హిట్లను నమోదు చేసుకున్నారు...రాబోయే రోజుల్లో పాన్ ఇండియా ను శాసించే సినిమాలు తీయడానికి మన స్టార్ హీరోలు కష్టపడుతుండటం విశేషం...

Tags:    

Similar News