దుర్గా పూజలో సడెన్‌గా RRR సీత ప్రత్యక్షం!
బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన దుర్గా పూజ (శుభో పుజో) పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన దుర్గా పూజ (శుభో పుజో) పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ కొత్త లుక్కుకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఆలియా ఎర్ర చీరలో ఎంతో అందంగా కనిపించింది. మరోసారి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని సీత రూపాన్ని గుర్తు చేసింది అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆలియా లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. `అనదర్ డే అనదర్ సారీ స్లే`, `చీరలో ఆలియా లుక్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది`, `దుర్గా పూజ లుక్స్` కోసం మేమంతా ఎదురుచూస్తుంటాము! అంటూ కామెంట్లు పెడుతున్నారు. తలలో తురిమిన పూలు..ఆ అవుట్‌ఫిట్ కలర్ పాలెట్ చాలా అందంగా ఉన్నాయని నెటిజన్లు ఎంతగానో కొనియాడుతున్నారు. మరోసారి ఆలియా భట్ ఈ కొత్త లుక్‌లో ఆర్.ఆర్.ఆర్ సీతను తలపించిందని తెగ మురిసిపోతున్నారు.
ఇదే సమయంలో సినీ పరిశ్రమలో అలియా భట్ విజయవంతంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దశాబ్దానికి పైగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ట్రెండ్‌కు తగ్గట్టుగా తన గ్లామర్‌తోనూ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. ఈ దుర్గా పూజ సందర్భం ఆలియా కెరీర్‌లోని ప్రత్యేక మైలురాయి తోడు కావడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయింది.
ఈ వేడుకలో మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే.. దుర్గా పూజలో ఆలియాతో కలిసి `బ్రహ్మాస్త్ర` దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా పూజలు ఆచరించారు. ఆలియాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా అతడు చాలా చనువుగా కలిసిపోయారు. వీరిద్దరి ఈ కలయిక కేవలం వ్యక్తిగత స్నేహానికే పరిమితం కాకుండా.. సినిమా పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయాన్ ముఖర్జీ ఇలా కనిపించడంతో `బ్రహ్మాస్త్ర 2` ప్రాజెక్ట్ ఇంకా ఆన్ లోనే ఉందని భావించవచ్చు. అయితే కరణ్ జోహార్, నమిత్ మల్హోత్రా లు `బ్రహ్మాస్త్ర 2` కోసం భారీగా పెట్టుబడి పెడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్స్ కోసం సినీ వర్గాలు, అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.