రకుల్ బికినీ కంటే ఘాటుగా..ఈ క్యాలెండర్ క్రేజ్ ఇంకా ఉందా?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్, గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది.

Update: 2026-10-19 13:30 GMT

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్, గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. పెళ్లి తర్వాత కూడా అమ్మడి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ దబూ రత్నానీ క్యాలెండర్ కోసం రకుల్ ఇచ్చిన ఫోజు ఇప్పుడు నెట్టింట సెగలు రేపుతోంది.





 


రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ షార్ట్, దానికి మ్యాచింగ్ గా బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకుని రకుల్ కనిపించిన తీరు కుర్రకారు మతి పోగొడుతోంది. జాకెట్ బటన్స్ ఓపెన్ చేసి, లెగ్స్ అందాలతో ఇచ్చిన ఈ బోల్డ్ ఫోజు సాధారణ బికినీ ఫోటోల కంటే చాలా ఘాటుగా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా పొగిడేస్తున్నారు. లాంగ్ బ్లాక్ బూట్స్, గోల్డ్ చైన్ బెల్ట్ తో రకుల్ తనలోని డేరింగ్ యాంగిల్ ను బయటపెట్టింది.

నిజానికి ఒకప్పుడు దబూ రత్నానీ క్యాలెండర్ లో కనిపించడం అంటే బాలీవుడ్ స్టార్లకు ఒక పెద్ద స్టేటస్ సింబల్ లా ఉండేది. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ క్యాలెండర్ లో తమ అభిమాన హీరోయిన్లు ఎంత బోల్డ్ గా కనిపిస్తారో అని ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేసేవాళ్లు. ఆ ఒక్క ఫోటోతోనే హీరోయిన్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయేది.

కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక గ్లామర్ కు అడ్డుకట్ట లేకుండా పోయింది. రకుల్ తో సహా ప్రతి హీరోయిన్ నిత్యం మాల్దీవుల వెకేషన్స్ అని, జిమ్ వర్కవుట్స్ అని రకరకాల బికినీ ఫోటోలను డైరెక్ట్ గా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రోజూ ఇంతకంటే ఘాటైన కంటెంట్ ఫ్రీగా మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ కోసం ఎదురుచూసే రోజులు పోయాయనే చెప్పాలి.

అయినా సరే, దబూ రత్నానీ బ్రాండ్ వ్యాల్యూ ఏమాత్రం తగ్గలేదనడానికి రకుల్ లేటెస్ట్ ఫోటోనే పెద్ద ఉదాహరణ. రొటీన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోషూట్లకు, ఇలాంటి ప్రొఫెషనల్ క్యాలెండర్ షూట్లకు ఉన్న తేడా ఇక్కడే కనిపిస్తోంది. ఆ లైటింగ్, రకుల్ ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫోటోను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇక డిజిటల్ యుగంలో క్యాలెండర్ల హవా తగ్గినా, రకుల్ లాంటి బ్యూటీలు ఇలాంటి అల్ట్రా బోల్డ్ లుక్స్ తో ఆ క్రేజ్ ను ఇంకా బతికిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు కాస్త తగ్గినా, ఇలాంటి ఫోటోషూట్లతో మేకర్స్ చూపు తనవైపు తిప్పుకోవడంలో మాత్రం రకుల్ ఫుల్ సక్సెస్ అయింది.

Tags:    

Similar News