టాలీవుడ్ స్టార్‌లకు సమ్మర్ బ్రేక్
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో స్టార్ హీరోలు నటించే ప్రతీ సినిమానీ నిర్మాతలు భారీ బడ్జెట్ లతో నిర్మిస్తున్నారు.;
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో స్టార్ హీరోలు నటించే ప్రతీ సినిమానీ నిర్మాతలు భారీ బడ్జెట్ లతో నిర్మిస్తున్నారు. దీంతో ఒకప్పుడు తెలుగు సినిమాను పట్టించుకోని వాళ్లందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయా సినిమాలు రిలీజవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న భారీ సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజి, రాజా సాబ్, ఫౌజి, డ్రాగన్, పెద్ది. స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలను నిర్మాతలు భారీగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. వారిలో ఎన్టీఆర్ తప్ప మిగిలిన స్టార్ హీరోలంతా సమ్మర్ లో ఈ షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తవడంతో ఎన్టీఆర్ కూడా బ్రేక్ తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మినహా మిగిలిన హీరోలంతా ఆల్రెడీ షూటింగ్స్ నుంచి బ్రేక్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
అందులో ముఖ్యంగా మొదట చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం షూటింగ్స్ కు హాజరయ్యే తీరిక లేదు. అందుకే షూటింగ్స్ నుంచి పవన్ బ్రేక్ లో ఉన్నాడని అంటున్నాం. ఒకవేళ పవన్ కు కుదిరి డేట్స్ అడ్జస్ట్ చేస్తే ఎంత సమ్మర్ లో అయినా సరే షూటింగ్ ను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు హరిహర వీరమల్లు, ఓజి చిత్ర మేకర్స్.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 టీమ్, తర్వాతి షెడ్యూల్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో బ్రేక్ వచ్చింది. దీంతో మహేష్ ఖాళీగా ఉన్నాడు. బుచ్చిబాబు సానతో రామ్ చరణ్ చేస్తున్న పెద్ది షూటింగ్ కు సమ్మర్ కారణంగా చరణ్ బ్రేక్ ఇచ్చాడు. ప్రభాస్ మోకాలి గాయం వల్ల సర్జరీ చేయించుకుని ఆల్రెడీ గత కొంతకాలంగా రెస్ట్ లోనే ఉన్నాడు. ఇక అల్లు అర్జున్, అట్లీతో చేయబోయే సినిమా కన్ఫర్మ్ అయినప్పటికీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని మొదలయ్యే సరికి జూన్ వచ్చేస్తుంది. సో టాలీవుడ్ స్టార్ హీరోలంతా సమ్మర్ లో బ్రేక్ లో ఉన్నట్టే అని చెప్పుకోవాలి.