ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని స్టార్ హీరోలు వీళ్లే..

ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చేయని మరో హీరో వరుణ్ తేజ్. మట్కా సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఈయన ఇప్పుడు మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు.;

Update: 2025-12-12 22:30 GMT

హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతోనైనా ప్రేక్షకుల ముందుకు రావాలి అని అభిమానులు కోరుకుంటారు. అందుకే హీరోలు కూడా సాధ్యమైనంత వరకు మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే ఒక్కొక్కసారి ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తే . మరొకసారి సినిమా లెంత్ కారణంగా లేదా ఇతర కారణాలవల్ల ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ఏడాదికి పైగానే పడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయకుండా అభిమానులను పూర్తిగా డిసప్పాయింట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. అలా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

వాస్తవానికి అడివి శేషు, వరుణ్ తేజ్, నిఖిల్, సాయి దుర్గా తేజ లాంటి యంగ్ హీరోలు ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఈసారి మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి. అయితే వీరంతా కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చి చిల్ అవుతున్నారా అంటే కాదు అని చెప్పాలి. ముఖ్యంగా నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ అనే చిత్రాలలో నటిస్తున్నారు. స్వయంభు సినిమా ఈ ఏడాది తెరపైకి రావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యంగా సాగుతున్న వేళ వచ్చే ఏడాదికి ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేశారు. ఇక ఇండియా హౌస్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కాబట్టి ఈ సినిమా 2027లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిమానులు కూడా చెబుతున్నారు.

మరొక హీరో అడివి శేషు.. మేజర్ , హిట్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం డెకాయిట్. అలాగే గూడచారి 2 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవ్వాల్సి ఉండగా హీరోయిన్ సడన్ గా తప్పుకోవడం, ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కాబట్టి ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19 కి పోస్ట్ పోన్ చేశారు. అలాగే గూడచారి 2 వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా మే 1న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. సాయి దుర్గ తేజ్ గా పేరు మార్చుకున్న ఈయన 2023లో బ్రో , విరూపాక్ష వంటి చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. గత ఏడాది ఈయన ఎలాంటి సినిమాలు రిలీజ్ చేయలేదు. కనీసం ఈ ఏడాదైనా ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు వస్తుంది అనుకున్నారు. కానీ అది కూడా రాలేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లక్ష్యంగా రాబోతోంది.

ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చేయని మరో హీరో వరుణ్ తేజ్. మట్కా సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఈయన ఇప్పుడు మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రధమార్ధంలో రిలీజ్ కాబోతోంది.

మరొక హీరో నవీన్ పోలిశెట్టి. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనగనగా ఒక రాజు సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మధ్యలో ఆయనకు యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు.

ఇకపోతే ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించని యంగ్ హీరోలే కాదు స్టార్ హీరోలు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. గత రెండేళ్లుగా తెరకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా విశ్వంభర సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఆ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల వాయిదా వేశారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది. అలాగే బాబీ డైరెక్షన్లో చేస్తున్న కొత్త మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.

ప్రభాస్ కూడా కల్కి 2898 ఏడి చిత్రంతో చివరిగా ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన నటిస్తున్న రాజ్ సాబ్ ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఆలస్యం కారణంగా వచ్చే యేడాది విడుదల కాబోతోంది.

అలాగే మహేష్ బాబు గత ఏడాది గుంటూరు కారంతో వచ్చి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసిలో నటిస్తున్నారు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఆయన సినిమాలు లేవనే చెప్పాలి . వారణాసి సినిమా 2027లో విడుదల కాబోతోంది.

అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప2 తర్వాత అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2027లో విడుదల కాబోతోంది. ఇలా ఈ హీరోలంతా కూడా ఈ ఏడాది పూర్తిగా అభిమానులను నిరాశపరిచారని చెప్పవచ్చు.

Tags:    

Similar News