బిజీగా ఉన్నా ఫింగరింగ్ మాత్రం ఆపలేదా!
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోది రెండు పడవల ప్రయాణం. కొంత కాలంగా రెండు రంగాల్లోనూ బిజీగా ఉంటు న్నారు? ఎంత బిజీ అంటే క్షణం తీరిక లేనంత బిజీ.;
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోది రెండు పడవల ప్రయాణం. కొంత కాలంగా రెండు రంగాల్లోనూ బిజీగా ఉంటు న్నారు? ఎంత బిజీ అంటే క్షణం తీరిక లేనంత బిజీ. ఓ వైపు సినిమా అభిమానుల్ని మరోవైపు తాను ఇష్టపడి కోరుకున్న రంగాన్ని సంతృప్తి పరచడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. సినిమాల్ని వదిలే యాలని ఉన్నా? వదల్లేని పరిస్థితి. ఒకప్పుడు సినిమా ఆయన్ని వదలకుండా వెంటే ఉంది. ఇప్పుడు అదే సినిమాని ఆయన వదల్లేకపోతున్నాడు. ఇక్కడ కారణాలు అనేకం. ఇలా ఇంత బిజీగా ఉన్న సమయంలో ఏ నటుడైనా ఇంకా బిజీ అవ్వాలని అనుకోరు.
అందులోనూ మరొకరి పనిలో వేలు పెట్టాలని అస్సలు అనుకోరు. కానీ ఈయన మాత్రం ఎంత బిజీగా ఉన్నా? ఆ సినిమాలో మాత్రం మళ్లీ ఫింగరింగ్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో గుస గుస మొదలైంది. త్వర లోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఆన్ సెట్స్ విషయాల్లోకి వెళ్తే? అసలు సంగతి బయట పడింది. సన్నివేశాలకు సంబంధించి ఇలా ఉంటే బాగుంటుందని సలహాలి చ్చి కొన్ని సన్నివేశాల్ని అప్పటికప్పుడు రీ-రైట్ చేయించారుట.
ఆయనకు తెలిసిన ఓ తమిళ రైటర్ తో వాటిని రాయించారుట. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి కూడా క్రియేటివ్ విభాగంలో తన పాత టీమ్ ని రంగంలోకి దించారుట. చిన్న పాటి కరెక్షన్స్ చేసి వాటిని రీషూట్ చేసారుట. అయితే ఈ విషయంలో అసలు డైరెక్టర్ ఎంత మాత్రం ఫీలవ్వలేదుట. సదరు హీరోకి అన్ని రకాలుగా మద్దతిచ్చినట్లు తెలిసింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు మీరు-నేను కలిస్తే మంచి ఔట్ పుట్ వస్తుందని సదరు హీరోకు అన్ని రకాలుగా సహకరించినట్లు తెలుస్తోంది.
ఇలా పాజిటివ్ గా తీసుకుంటనే సినిమాలు పూర్తవుతాయి. లేదంటే క్రియేటివ్ డిఫరెన్స్ తో మధ్యలోనే ఆగిపోతుంటాయి. పైగా హీరో సీనియర్...గతంలో డైరెక్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది. ఇదంతా పక్కన బెడితే ప్రతీ సినిమా విషయంలోనూ ఆయన విధిగా కల్పించుకుంటారు? అనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. అందులోనూ కొత్త మేకర్ తో పని చేస్తున్నాడంటే ఆయన భయాలు ఆయనకు ఉంటాయి. వందల కోట్ల ప్రాజెక్ట్ అటు ఇటు అయితే పరిస్థితి ఎక్కడికో దారి తీస్తుంది. త్వరలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి.