ఫ్లో మిస్ చేసే సాంగ్స్ కి కోట్లు ఖర్చు ఎందుకో..?

మిగతా భాషల సినిమాల్లో ఇది జరుగుతుందా అన్నది స్పష్టత లేదు అఫ్కోర్స్ జరుగుతున్నా కూడా అది ఎప్పుడో ఒకసారి అన్నట్టు ఉంది.;

Update: 2025-10-13 12:00 GMT

మిగతా భాషల సినిమాల్లో ఇది జరుగుతుందా అన్నది స్పష్టత లేదు అఫ్కోర్స్ జరుగుతున్నా కూడా అది ఎప్పుడో ఒకసారి అన్నట్టు ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం అది రిపీట్ అవుతూనే ఉంది. ఇంతకీ ఏంటి అదీ అంటే సినిమాలో కోట్లు ఖర్చు పెట్టి ఒక సాంగ్ చేయడం తీరా సినిమాలో చూస్తే ఆ సాంగ్ లేకుండా వదలడం. అదేంటి అంటే సినిమా ఫ్లో మిస్ అవుతుంది అందుకే సాంగ్ స్కిప్ చేశామంటున్నారు మేకర్స్. ఈమధ్య ఈ కామెంట్ మరీ రొటీన్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్ కోసం ముందే ఆ సాంగ్ ని రిలీజ్ చేయడం కొంతమంది ఆడియన్స్ ఆ సాంగ్ నచ్చి దాని కోసమే సినిమాకు వెళ్లడం అది సినిమాలో లేదని తెలిసి డిజప్పాయింట్ అవ్వడం జరుగుతుంది.

ఆ సాంగ్స్ వల్ల సినిమాకు నష్టం వస్తుందా..

గేమ్ ఛేంజర్, కింగ్ డమ్ రీసెంట్ గా వచ్చిన మిరాయ్, ఓజీ సినిమాల్లో కూడా సినిమా ఫ్లోని బ్రేక్ చేస్తుందని భారీగా ఖర్చు పెట్టిన సాంగ్ ని సైతం పక్కన పెట్టారు. ఐతే ఆ సాంగ్స్ వల్ల సినిమాకు నష్టం వస్తుందా అని అనుకున్నారు కానీ ఆ సాంగ్ కోసమే సినిమాకు వచ్చిన వాళ్లు ఉంటారన్న విషయాన్ని గుర్తించట్లేదు. హిట్టైతే ఆ సాంగ్స్ ని యాడ్ చేస్తున్నారు కానీ ఫ్లాపైతే మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా కోసం కూడా యూరప్ లో రెండు సాంగ్స్ షూట్ కి చిత్ర యూనిట్ వెళ్లారు. అక్కడ కాస్ట్ లీ లొకేషన్స్ లో భారీగా ఖర్చు చేసి మరీ ఆ సాంగ్ ని చేస్తున్నారట. ఐతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమాలోనే వైబ్ ఉంది బేబీ సాంగ్ సినిమాలో స్కిప్ చేశారు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన వారానికి యాడ్ చేశారు. రాజా సాబ్ ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ.. ఆ సినిమాలో సాంగ్స్ అనేవి డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి. ఈ విషయంలో మారుతి ఆలోచన ఏమో కానీ ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి తీసిన సాంగ్స్ సినిమాలో పెడతారా లేదా అన్న డౌట్ వస్తుంది.

ఫారిన్ లోకేషన్స్ లో సాంగ్స్..

డైరెక్టర్ మారుతి సినిమా లెంగ్త్ ఇంకా ఏది అవసరం ఏది అనవసరం లాంటి విషయాల్లో చాలా ప్లానింగ్ తో ఉంటాడు. రాజా సాబ్ లో సాంగ్స్ అది కూడా ఫారిన్ లోకేషన్స్ లో అంటే మారుతి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని చెప్పొచ్చు. మరి ఇంత ఖర్చు పెట్టి తీసి తీరా సినిమాలో లేకపోతే మాత్రం నిజంగానే ఆ కష్టం ఇంకా ఆ సాంగ్ కి పెట్టిన బడ్జెట్ అంతా వేస్ట్ అవుతుంది. రాజా సాబ్ మాత్రమే కాదు చేస్తున్న ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే.

Tags:    

Similar News