టాలీవుడ్ బిగ్ బ్యానర్ లో ముసలం.. సినిమా పోయినందుకు అతడు ఔట్
ఇటీవల అతను ఆ కంపెనీలో రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పర్యవేక్షించాడు. అందులో ఒకటి తెలుగు దర్శకుడు తెరకెక్కించిన హిందీ చిత్రం.;
సినిమా మేకింగ్ లో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రొడ్యూసర్. అతను పెట్టే ఖర్చుతోనే సినిమా రెడీ అవుతుంది. అయితే సినిమా నిర్మాణం వ్యవహారాలన్నీ చక్కబెట్టాలంటే ఒక్కడితో అయ్యే పని కాదు. ఇందుకోసం నిర్మాతలు ఓ సంస్థను ఏర్పర్చుకొని కొందరిని టీమ్ గా నిమయమించుకుంటారు. ఈ ప్రొడక్షన్ హౌస్ లోని ఆయా వ్యక్తులు ఆయా పనులు చక్కబెడతారు.
అయితే తాజాగా టాలీవుడ్ లోని ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. తొలుత ఆ వ్యక్తి మార్కెటింగ్ విభాగాన్ని పర్యవేక్షించడానికి ఈ ప్రొడక్షన్ హౌస్‌లోకి ప్రవేశించాడు. అలా నెమ్మదిగా యజమానుల వద్ద నమ్మకం సంపాదించాడు. క్రమంగా కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగాడు.
అంతేకాకుండా ఆ ప్రొడక్షన్ హౌస్ లో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ సినిమాకు అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నియమించబడ్డాడు. అలా క్రమంగా ఎదుగుతూ సినిమా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. కానీ అక్కడే వచ్చింది అసలు సమస్య. ఈ నిర్ణయం భాగస్వాముల మధ్య మనస్ఫర్థాలకు దారి తీసింది. అతడిని తమ నుండి దూరం చేసింది!
ఇటీవల అతను ఆ కంపెనీలో రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పర్యవేక్షించాడు. అందులో ఒకటి తెలుగు దర్శకుడు తెరకెక్కించిన హిందీ చిత్రం. ఇంకోటి, యంగ్ నటీనటులతో రూపొందిచిన చిన్న బడ్జెట్ తెలుగు సినిమా. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ రెండు సినిమాల్లోనూ ఆ నిర్మాణ సంస్థ కంపెనీ డబ్బు కోల్పోయింది. అలా సినిమాలో లాస్ అవ్వడంతో తమ కంపెనీలో కీలక వ్యక్తులు ఆయన్ను తప్పించారని తెలుస్తోంది.
అయితే అతడినికి తప్పించాడానికి ఇక్కడ రెండు వెర్షన్ లు కనిపిస్తున్నాయి. అతడి అసమర్థత కారణంగా ప్రాజెక్ట్ బడ్జెట్ తొలుత అనుకున్నదానికంటే భారీగా పెరిగిందని కంపెనీలో బాస్ స్థానంలో ఉన్న వాళ్లు భావించారు. ఇలా డబ్బు కారణంగానే వాళ్లు విడిపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.