బిగ్ రిస్క్.. చిన్న సినిమాల వెనుక పాన్ ఇండియా స్కెచ్

బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. కానీ ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ మాత్రం వరుసగా దెబ్బలు తగులుతున్నా ఎక్కడా తగ్గడం లేదు.;

Update: 2026-05-08 04:45 GMT

బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. కానీ ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ మాత్రం వరుసగా దెబ్బలు తగులుతున్నా ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ గా ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కాస్త ఊరటనిచ్చింది, అది కూడా పొంగల్ పండగ టైమ్ లో వచ్చి క్లిక్కయింది. మిగతావన్నీ నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఇలాంటి టైమ్ లో ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కాస్త గ్యాప్ తీసుకుంటుంది.

కానీ ఈ బ్యానర్ మాత్రం దానికి రివర్స్ లో వెళ్తూ, సైలెంట్ గా ఉండకుండా అరడజను ప్రాజెక్టులను లైన్లో పెట్టి అందరికీ షాక్ ఇస్తోంది. ఈ హడావుడి వెనుక ఏదో బలమైన కారణం ఉందనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ లో హీట్ పుట్టిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ చిన్న సినిమాలన్నీ కేవలం ఒక బిగ్ గేమ్ లో భాగమేనని ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్ లో ఉన్న ఒక టాప్ స్టార్ హీరోతో బిగ్ బడ్జెట్ లో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని ఈ బ్యానర్ ప్లాన్ చేస్తోంది.

అంత పెద్ద సినిమాకు ఫండింగ్ రావాలంటే ఆ సంస్థకు మార్కెట్ లో మంచి క్రెడిబిలిటీ ఉండాలి. వరుస ఫ్లాపులు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఫైనాన్షియర్లు అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. అందుకే తాము చాలా బిజీగా ఉన్నామని, చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నాయని చూపించుకోవడమే ఈ అనౌన్స్‌మెంట్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ బిజినెస్ స్ట్రాటజీలో మరో యాంగిల్ కూడా ఉంది. చిన్న హీరోలతో చేసే సినిమాల వల్ల ఓటీటీ శాటిలైట్ హక్కుల రూపంలో కొంత అడ్వాన్స్ అమౌంట్ చేతికి అందుతుంది. ఈ క్యాష్ ఫ్లో ని ఉపయోగించి ఆ పెద్ద సినిమా పనులను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఒక రకంగా ఈ చిన్న సినిమాలన్నీ ఆ మెగా ప్రాజెక్ట్ కు సెక్యూరిటీ లాంటివి అన్నమాట. బాలీవుడ్ లోని కార్పొరేట్ కంపెనీలు ఫాలో అయ్యే ఈ పద్ధతిని ఇప్పుడు మన నిర్మాతలు కూడా ఫాలో అవుతున్నారు.

దీనివల్ల ఫైనాన్స్ కంపెనీల దగ్గర తమ బ్యానర్ కి ఒక రకమైన 'యాక్టివ్' ఇమేజ్ ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో ఉన్న అతిపెద్ద రిస్క్ ఏంటంటే.. ప్రకటించిన సినిమాలన్నీ పక్కాగా పట్టాలెక్కాలి. కేవలం పేపర్ మీద అనౌన్స్ చేసి వదిలేస్తే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. పైగా ఇప్పుడున్న ఆడియన్స్ కేవలం స్టార్ హీరోల పేర్లు చూసి థియేటర్లకు రావడం లేదు, కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కేవలం బిజినెస్ లెక్కల కోసం సినిమాలు చుట్టేస్తే, అది తిరిగి ఆ పెద్ద సినిమాకే ఎసరు పెట్టే ప్రమాదం ఉంది. బడ్జెట్ కంట్రోల్ తప్పినా, లేదా ఈ చిన్న సినిమాల్లో ఏదైనా తేడా కొట్టినా ఆ ప్రభావం మొత్తం బ్యానర్ మీద పడుతుంది. ఏదేమైనా ఒక పెద్ద హిట్ కోసం ఆ నిర్మాణ సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి.

Tags:    

Similar News