ఆ నిర్మాతనే ముందు ఎన్కౌంటర్ చేయాలి: ఐబొమ్మ రవి తండ్రి

అయితే ఐబొమ్మ వల్ల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అనేక మంది సెలబ్రిటీలు ఇటీవల వ్యాఖ్యానించారు.;

Update: 2025-11-23 11:36 GMT

సినీ ఇండస్ట్రీ ఐబొమ్మ రవి గురించి జోరుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తున్న అతడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రవిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ఆ సమయంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

అయితే ఐబొమ్మ వల్ల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అనేక మంది సెలబ్రిటీలు ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఐబొమ్మ రవి వంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలని నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్య.లు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తీవ్ర దుమారాన్ని కూడా రేపాయి.

ఇప్పుడు సి. కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రవి తండ్రి అప్పారావు స్పందించారు. తన కుమారుడిని ఉద్దేశించి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆ నిర్మాతను ఎన్ కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని అన్నారు. నొప్పి ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తన కొడుకు చేసింది తప్పే అని తాను ఒప్పుకుంటున్నట్లు చెప్పిన రవి తండ్రి.. చట్ట ప్రకారం ఏ శిక్షైనా విధించవచ్చని వ్యాఖ్యానించారు. కానీ తన కుమారుడికి ఎన్ కౌంటర్ ఇచ్చే హక్కు ఎవరిచ్చారని అడిగారు. ఏదేమైనా సినిమాలో మ్యాటర్ ఉంటే.. ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ కు వచ్చి చూస్తారని అన్నారు.

తాను ఒకప్పుడు 45 పైసలతో సినిమా చూశానని అన్నారు. కానీ ఇప్పుడు అలా కాదని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు బాగా పెరిగిపోయాయని తెలిపారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చిత్రాన్ని ఎవరు తీయమన్నారని క్వశ్చన్ చేశారు. అదే సమయంలో కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. ఆ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

అయితే ఐబొమ్మ రవిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంచల్ గూడ జైలులో ఉన్న అతడిని విచారిస్తున్నారు. అదే సమయంలో బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషనల్‌ వ్యవహారంలో మరో కేసు నమోదవ్వగా.. పలువురు దర్మకులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.

Tags:    

Similar News