టాలీవుడ్‌లో వైలెంట్ లవ్ స్టోరీస్ ట్రెండ్
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త కథాంశాల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు వెండితెరపై సున్నితమైన భావోద్వేగాలు.. ఆహ్లాదకరమైన హాస్యంతో సాగిపోయే క్లాస్ ప్రేమకథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు.
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త కథాంశాల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు వెండితెరపై సున్నితమైన భావోద్వేగాలు.. ఆహ్లాదకరమైన హాస్యంతో సాగిపోయే క్లాస్ ప్రేమకథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. ఈ నేపథ్యంలో లవ్ అండ్ రొమాన్స్ మాత్రమే కాకుండా దానికి ఊరమాస్ యాక్షన్ వయొలెన్స్‌ను జోడించి తెరకెక్కిస్తున్న వైలెంట్ లవ్ స్టోరీస్ వైపే టాలీవుడ్ మేకర్స్ - యువ హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఈ సరికొత్త యాక్షన్ ప్రేమకథల ట్రెండ్‌లో అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తోన్న `లెనిన్` చిత్రం ఆసక్తిని రేకెత్తి స్తోంది.
మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ప్రేమకథ. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా ఊరమాస్, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. అఖిల్ కు జోడీగా భాగ్య శ్రీ బోర్సే ఎంపిక అంతకంతకు మంచి హైప్ తీసుకొస్తుంది. అలాగే ఘట్టమనేని కుటుంబం నుండి వెండితెరకు పరిచయమవుతున్న మరో వారసుడు జయకృష్ణ కూడా తొలి ప్రయత్నంగా మాస్ జానర్‌నే ఎంచుకున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని ఊరమాస్ ప్రేమకథగా మలుస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రషా తడాని ఇదే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. ఈ వైలెంట్ లవ్ స్టోరీస్ జాబితా యువ హీరోలకే పరిమితం కాలేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే గ్లోబల్ స్టార్ ప్రభాస్, క్లాసిక్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `ఫౌజీ` చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సాగే పీరియాడిక్ లవ్ స్టోరీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. యుద్ధ సన్నివేశాలతో కూడిన లవ్ డ్రామాను ప్రేక్షకులు చూడబోతున్నారు.
హను మార్కు ఇంటెన్స్ ఎమోషన్స్‌తో పాటు ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవ నున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ కూడా తన మాస్ ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం `రౌడీ జనార్ధన` పూర్తి స్థాయి మాస్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొం దు తోంది. ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఇంకా నవతరం హీరోలు నటిస్తోన్న మరికొన్న చిత్రాలు కూడా తాజా ట్రెండింగ్ పేట్రన్ లోనే తెరకెక్కుతున్నాయి.