రెండో సినిమాతో రీల్‌ లవ్‌ రియల్‌ లవ్‌గా మారిందా?

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ వ్యవహారం అనేది చాలా కామన్‌ విషయం.

Update: 2026-09-10 19:30 GMT

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ వ్యవహారం అనేది చాలా కామన్‌ విషయం. సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మల నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వరకు ఎంతో మంది కలిసి నటించి, ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ముందు ముందు కూడా చాలా రీల్‌ జంటలు రియల్‌ లైఫ్ జంటలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉండగానే మరో టాలీవుడ్‌ జంట ప్రేమ వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా అయితే ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతారు. కానీ వారు నటించిన సినిమాల ప్రమోషన్స్‌ కు హాజరు అయిన సమయంలో, మరేదైనా ఈవెంట్‌కి హాజరు అయిన సమయంలో వారి మధ్య కెమిస్ట్రీ క్లీయర్‌గా కనిపిస్తుంది. కనుక తాజాగా ఒక కొత్త జంట పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రెండో సినిమా ప్రారంభం సమయంలో...

ఇంతకు ముందు ఒక సినిమాలో నటించిన ఆ జంట ఇటీవల మరో సినిమాలో నటించడం జరిగింది. హీరో హీరోయిన్‌ ఇద్దరు వరుసగా రెండు సినిమాలు చేస్తే కచ్చితంగా ఏదో ఉందనే టాక్‌ రావడం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఆ హీరో, ఆ హీరోయిన్‌ మరే సినిమా చేయకుండా ఆగి మరీ మళ్లీ కలిసి చేయడం అంటే కచ్చితంగా ఏదో ఉంది అనే కదా అర్థం అని చాలా మంది ఆ జంట విషయమై కామెంట్స్ చేస్తున్నారు. మొదటి సినిమా ప్రమోషన్ సమయంలో పెద్దగా వారి మధ్య ప్రేమ ఉన్నట్లు అనిపించలేదని, కానీ రెండో సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి వారిద్దరి మధ్య రీల్‌ కెమిస్ట్రీ కాకుండా రియల్‌ కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుందా అనే అనుమానాలు కలిగాయని, సినిమా పూర్తి అయ్యే సమయం కు అది నిజమైన కెమిస్ట్రీ అనిపిస్తుందని దగ్గర నుంచి పరిశీలించిన వారు మాట్లాడుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

కెరీర్‌ పరంగా నిలదొక్కుకోవాల్సి ఉంది...

ఆ హీరో గారు కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఒకటి రెండు హిట్స్ పడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని బలంగా కష్టపడుతున్నాడు. తనకు ఉన్న మద్దతుతో సినిమా ఇండస్ట్రీని ఫ్యూచర్‌లో దున్నేయాలని ఆశ పడుతున్నాడు. అందుకే ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఏది పడితే అది అన్నట్టుగా కాకుండా మెల్లగా సినిమాలు చేస్తున్నాడు. చేసిన ప్రతి సినిమా బాగుండాలనే ఉద్దేశంతో ఆ హీరో సినిమాలు చేస్తున్నట్లు ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు చూస్తుంటే అర్థం అవుతుంది. మరో వైపు ఆ హీరోయిన్‌ కూడా కెరీర్ ఆరంభంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. కింది స్థాయి నుంచి హీరోయిన్‌గా ఎదగడం వల్ల తప్పకుండా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్‌ ఉంటుందనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీలో ప్రేమ కథలు...

కెరీర్‌ పరంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న వీళ్లు ఇప్పుడు ప్రేమ అంటూ హడావుడి చేస్తే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. చాలా మంది హీరో హీరోయిన్స్‌ ప్రేమలో పడ్డా ఏళ్ల తరబడి ఆ విషయాన్ని కనీసం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతారు. పదేళ్లు ప్రేమలో ఉన్న జంటలు మీడియాకు విషయం తెలియకుండా మ్యానేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ జంట రెండో సినిమాకే ఆన్‌ స్టేజ్‌, ఆఫ్‌ స్టేజ్‌ రొమాన్స్‌, కెమిస్ట్రీతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెబుతున్నారు. ఈ విషయంలో వారికి సీనియర్స్ నుంచి కాస్త సూచనలు అవసరం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్‌ ఎవరు? అని ఆలోచిస్తున్నారా.. అతి త్వరలోనే వారే స్వయంగా తాము ప్రేమలో ఉన్నట్లుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కనుక అప్పటి వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News