గెట్ రెడీ.. త్వరలో '5' టాలీవుడ్ బిగ్ అనౌన్స్మెంట్స్!!

ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మరి ఏ హీరో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రానుందో ఓసారి తెలుసుకుందాం.;

Update: 2025-03-31 11:17 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ పై అనేక సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల నుంచి చిన్న కథానాయకుల వరకు అనేక మంది నటుల చిత్రాలు రూపొందుతున్నాయి. త్వరలోనే అవన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే రిలీజ్ కు ముందు మేకర్స్.. రకరకాల అప్డేట్స్ తో సందడి చేయడం కామనే.

ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఐదు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. బడా హీరోల సినిమాల మేకర్స్.. తమ బిగ్ అప్డేట్స్ తో ఓ రేంజ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మరి ఏ హీరో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రానుందో ఓసారి తెలుసుకుందాం.

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో పెద్ది మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. ఏప్రిల్ 6వ తేదీన గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా.. సినిమా నుంచి వీడియో గ్లింప్స్ రానుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రెడీ అవుతున్న రాజా సాబ్ నుంచి అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. సినిమా టీజర్ ను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే మేకర్స్ అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఇప్పుడు బన్నీ బర్త్ డే ఏప్రిల్ 8వ తేదీన ప్రకటన రానుందని సమాచారం. ఆ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. మహేష్- రాజమౌళి మూవీ అప్డేట్ కూడా ఏప్రిల్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

కొద్ది రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. త్వరలోనే జక్కన్న ప్రెస్ మీట్ ను పెట్టనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు మూవీ టీజర్ లేదా ట్రైలర్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. మొత్తానికి ఏప్రిల్ లో ఐదుగురు బడా హీరోల మూవీ అప్డేట్స్ రానున్నాయన్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News