ఆ స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవ‌డం లేదుగా!

టాలీవుడ్ స్క్రీన్ పై మాస్ అప్పిరియ‌న్స్ కొత్తేం కాదు. మాస్ కంటెంట్ లో హీరోలు బాక్సాఫీస్ ని ర‌ప్ఫా డించిన సంద‌ర్భాలెన్నో.;

Update: 2025-04-11 05:41 GMT

టాలీవుడ్ స్క్రీన్ పై మాస్ అప్పిరియ‌న్స్ కొత్తేం కాదు. మాస్ కంటెంట్ లో హీరోలు బాక్సాఫీస్ ని ర‌ప్ఫాడించిన సంద‌ర్భాలెన్నో. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్, బ‌న్నీ లాంటి స్టార్ హీరోలు ఎప్పుడో మాస్ ని ప‌రిచయం చేసారు. ఆ త‌ర్వాత తెర‌పై మాస్ అనేది వివిధ ర‌కాలుగా రూపాంత‌రంచెందుతూ వ‌చ్చింది. మాస్ లో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర తీసారు.

`రంగ‌స్థ‌లం`లో రామ్ చ‌ర‌ణ్‌, `అర్జున్ రెడ్డి`లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, `పుష్ప‌`లో అల్లు అర్జున్, `ద‌స‌రా`లో నాని ఇలా స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిగాయి. ఇవ‌న్నీ భారీ విజ‌యం సాధించిన చిత్రాలు. దీంతో అదే ట్రెండ్ గా మారింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం `పెద్ది`లోనూ చ‌ర‌ణ్ మాస్ లుక్ కాక పుట్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిట్టిబాబు ను మంచిన ర‌గ్గ‌డు పాత్ర‌ను `పెద్ది`లో చ‌ర‌ణ్ పోషిస్తున్నాడ‌ని గ్లింప్స్ తో తేలిపోయింది.

అలాగే అక్కినేని వార‌సుడు అఖిల్ కూడా `లెనిన్` తో మాస్ ని ట్రై చేస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ స్టోరీలో అకిల్ రోల్ ని ఊర‌మాస్ గా డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మెగా మేన‌ల్లుడు సాయితేజ్ కూడా `సంబ‌రాల ఏటిగ‌ట్టు` కోసం మాస్ ని గ‌ట్టిగానే ప్లాప్ చేసాడు . అత‌డి భారీ దేహం గుబురు గెడ్డం క‌టౌట్ చూస్తుంటే మామూలు మాస్ కాద‌ది. ఇంకా యంగ్ హీరో సాయి శ్రీనివాస్ `భైవ‌ర` కోసం ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

శ్రీనివాస్ మాస్ లుక్ అదిరిపోయింది. అత‌డి క‌టౌట్ కి త‌గ్గ స‌రైన రోల్ గా హైలైట్ అవుతుంది. అయితే సినిమాల్లో ఈ మాస్ యాంగిల్ అన్న‌ది క‌థ కోస‌మైతే ప‌ర్వాలేదు. కానీ ట్రెండ్ ని ఫాలో అయి మాస్ యాంగిల్ ట్రై చేస్తే గ‌నుక చేతులు కాల్చుకోవ‌డం ఖాయ‌మ‌నే విమ‌ర్శ కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. మాస్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వొచ్చు అన్న‌ది పాత ప‌ద్ద‌తి. ప్రేక్ష‌కుడు ఇప్పుడు క‌థ‌లో ద‌మ్ము ఎంతుందో విశ్లేషిస్తున్నాడు. అన‌వ‌స‌ర ఎలివేష‌న్ స‌న్నివేశాల‌కు క‌నెక్ట్ అవ్వ‌డం లేదు. క‌థ‌కి ఆ సీన్ ఎంత డిమాండ్ చేస్తుంది? అని లోతైన విశ్లేష‌ణ కూడా అంతే అవ‌స‌రం అని ఆలోచించే స్థాయికి కామ‌న్ ఆడియ‌న్ రీచ్ అయ్యాడు. ఇవ‌న్నీ మేక‌ర్స్ దృష్టిలో పెట్టుకుని ప్రేక్ష‌కుడిని ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది సుమీ.

Tags:    

Similar News