4 బడా చిత్రాలు.. ఇంటర్నేషనల్ రేంజ్ లోనే..

తెలుగు సినిమా రేంజ్.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. అప్పట్లో మన దేశంలో సినిమా అంటే బాలీవుడ్ అనేలా ఉండేది పరిస్థితి.;

Update: 2025-09-03 12:30 GMT

తెలుగు సినిమా రేంజ్.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. అప్పట్లో మన దేశంలో సినిమా అంటే బాలీవుడ్ అనేలా ఉండేది పరిస్థితి. కానీ కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయి. బీ టౌన్ చిత్రాలకు గట్టి పోటీనిస్తున్నాయి. అందులో టాలీవుడ్ చిత్రాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వేరే లెవెల్ లో సందడి చేస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ లెవెల్ రీజనల్ స్టేజ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి విస్తరించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు సిద్ధమవుతోంది. అందుకు గాను త్వరలో నాలుగు బడా సినిమాలు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఇప్పుడు వర్క్ ఎంతవరకు వచ్చింది? వంటి విషయాలను పరిశీలిద్దాం.

అయితే మొదటి చెప్పుకోవాల్సింది.. SSMB 29 గురించి.. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కెన్యాలో చిత్రీకరణ జరుగుతుండగా.. 120 దేశాల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో అనేక మంది విదేశీ నటీనటులు కూడా భాగం కానున్నారు.

అదే సమయంలో అల్లు అర్జున్, అట్లీ కలయికలో రూపొందుతున్న AA 22 ప్రాజెక్టు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్‌ రేంజ్‌ లో సినిమాను రూపొందిస్తున్నారు. అక్కడ సినిమాను మార్కెటింగ్ కూడా చేయనున్నారు. అనేక మంది ఫారిన్ టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్.. త్వరలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఆ సినిమా ద్వారా సందీప్ వంగా కొత్త చరిత్ర సృష్టించేలా ప్రణాళికలను రచిస్తున్నారు. ఆచరణలో కూడా పెట్టనున్నారు.

కాగా, టాలీవుడ్ నుంచి వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీగా జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది. స్పెషల్ స్క్రిప్ట్ తో హై యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుందని తెలుస్తోంది. మూవీ టైటిల్ డ్రాగన్ గా ప్రచారం జరుగుతోంది.

అలా ఈ నాలుగు చిత్రాలు.. అంతర్జాతీయ విడుదల కోసం సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరి టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్త విస్తరణకు మార్గాన్ని ఏ సినిమా సుగమం చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News