టాలీవుడ్ టూ ఇంట‌ర్నేష‌న‌ల్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అనే ముద్రను చెరిపేసి నేడు అంతర్జాతీయ వేదికలపై గర్వంగా నిలబడుతోంది.;

Update: 2026-05-07 09:19 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అనే ముద్రను చెరిపేసి నేడు అంతర్జాతీయ వేదికలపై గర్వంగా నిలబడుతోంది. ప్రాంతీయ భాషా చిత్రంగా మొదలైన టాలీవుడ్ ప్రయాణం, నేడు గ్లోబల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంటోంది. కథాంశంలోనే కాకుండా సాంకేతిక విలువలు, భారీ బడ్జెట్ , మేకింగ్ స్టైల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ప్రపంచ సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. మేకర్స్ ఇప్పుడు లోకల్ బాక్సాఫీస్ లెక్కల కోసం కాకుండా? గ్లోబల్ ఆడియన్స్‌ను అలరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

ఈ అంతర్జాతీయ మార్పుకు విశ్వగురువుగా నిలిచారు దర్శకధీరుడు రాజమౌళి. `బా`హుబలి` చిత్రంతో భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన జ‌క్క‌న్న ` ఆర్ ఆర్ ఆర్ ` సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు జెండాను ఎగుర వేశారు. రాజమౌళి వేసిన ఈ బలమైన పునాది హాలీవుడ్ విమర్శకులు సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. సినిమాను కేవలం థియేటర్లలో విడుదల చేయడమే కాకుండా? విదేశీ మార్కెట్లలో దానిని ఎలా ప్రమోట్ చేయాలి? అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఎలా నిలబెట్టాలి? అనే విషయంలో రాజమౌళి ఓ కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.

రాజమౌళి చూపిన బాటలో నేడు మరికొంత మంది దర్శకులు తమ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. `కల్కి 2898 ఏడీ` వంటి చిత్రాలతో నాగ్ అశ్విన్ భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్ జోడించి గ్లోబల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా తమ చిత్రాల్లోని ఇంటెన్సిటీతో భాషా సరిహద్దులను చెరిపేస్తున్నారు. ఇప్పుడొస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ దేశీయ మార్కెట్ కోసం కాకుండా? జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేస్తున్నారు.

సినిమా మేకింగ్ పరంగానే కాకుండా? ప్రమోషన్ల విషయంలో కూడా టాలీవుడ్ మేకర్స్ భారీ మార్పులు తీసుకొచ్చారు. ఒక సినిమాను స్థానిక మీడియాకే పరిమితం చేయకుండా గ్లోబల్ ఈవెంట్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చూస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేయడంపై దృష్టి పెడుతున్నారు. మేకింగ్‌లో వాడే విజువల్ ఎఫెక్ట్స్ ,సౌండ్ డిజైన్ వంటి అంశాల్లో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటూ క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు.

టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం వల్ల కథల వైవిధ్యం ప్రపంచానికి తెలుస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు , భావోద్వేగాలకు గ్లోబల్ ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇది సినిమాల‌ మార్కెట్ పెంచడమే కాకుండా తెలుగు నటీనటులకు , టెక్నీషియన్లకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెస్తోంది. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న తదుపరి చిత్రం వంటి ప్రాజెక్టులు పూర్తిగా గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాలుగా తెరకెక్కుతుండటం పరిశ్రమ స్థాయిని మరింత పెంచుతోంది. ఆర‌కంగా టాలీవుడ్ గ్లోబల్ సినిమా హబ్‌గా మారుతోంది. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచం గుర్తించింది. మేకర్స్ చూపిస్తోన్న ధైర్యం, క్రియేటివిటీ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టించడం ఖాయం.

Tags:    

Similar News