లవ్ రూమర్స్.. దర్శకుడు, హీరోయిన్ పెళ్లి కన్ఫర్మ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు, అలాగే ప్రేమ వివాహాలు మనం చూస్తూనే ఉన్నాం.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు, అలాగే ప్రేమ వివాహాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తమ ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చుకున్న విషయం తెల్సిందే. పెద్దల సమక్షంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి జోడీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతకు ముందు కూడా ఎంతో మంది హీరో హీరోయిన్స్, దర్శకుడు హీరోయిన్, నిర్మాత దర్శకుడు ఇలా చాలా మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం మనం చూశాం. ఇప్పుడు మరో ప్రేమ జంట టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు వారి నుంచి ప్రేమ విషయం, పెళ్లి విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇండస్ట్రీ మొత్తం వారి ప్రేమ విషయాన్ని కోడై కూస్తోంది. పెళ్లి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
టాలీవుడ్ దర్శకుడి పెళ్లి...
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండ్డింగ్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. ఒక వైపు దర్శకత్వం చేస్తూ, మరో వైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న దర్శకుడు, మరో వైపు హీరోయిన్గా వరుస సినిమాలు, సిరీస్లు చేస్తున్న హీరోయిన్కి ప్రేమ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరి కాంబినేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే వారి ప్రేమ విషయం కన్ఫర్మ్ అయింది. కానీ ఎప్పుడు కూడా ఇద్దరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు. అందుకే వారి పేర్లు అందరికీ తెలిసినా ఇప్పుడు చెప్పడం లేదు. వారి నోటి నుంచి అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు మీడియా వారు వారి పేర్లను బయటకు చెప్పకుండా వస్తుంది. ఆ జంటకు రెస్పెక్ట్ ఇచ్చి మీడియా వారు వారి పేర్లను బహిరంగంగా చెప్పడం లేదు.
హీరోయిన్తో దర్శకుడి పెళ్లి...
సోషల్ మీడియాలో వారి జంట గురించి, వారి పెళ్లి గురించి రచ్చ రచ్చగా చర్చ జరుగుతోంది. ఇద్దరి ఫోటోలు తీసుకుని ఏఐ ని ఉపయోగించి పెళ్లి చేస్తున్నారు, వారు ఇంతకు ముందు నటించిన క్లిప్స్ ను తీసుకుని పెళ్లి అయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఆ జోడీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా దూరం వెళ్లిన వీరి ప్రేమ విషయంకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి, పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ దర్శకుడి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మరింతగా చర్చ మొదలైంది. ఆ సినిమా విడుదలైన వెంటనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాలని భావిస్తున్నారు. సినిమాకు పర్సనల్ లైఫ్ కి సంబంధం ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆ దర్శకుడు సినిమా విడుదలైన తర్వాత క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
టాలీవుడ్లో మరో ప్రేమ పెళ్లి...
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆ దర్శకుడి సన్నిహితులు చెబుతున్న ప్రకారం పెళ్లికి సంబంధించిన డేట్ను అనుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇరు కుటుంబాల వారు కలిసి కూర్చుని పెళ్లి, ఇతర వివాహ తంతు గురించి కూడా మాట్లాడుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రేమ, పెళ్లి విషయంలో ఆ దర్శకుడు, హీరోయిన్ అనుకున్నట్లుగా ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. టాలీవుడ్లో ఇంతకు ముందు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న జంటల మాదిరిగానే ఈ కొత్త జంట పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అంతా కోరుతున్నారు. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉండటం లేదా పెళ్లికి సంబంధించిన కీలక కన్ఫర్మేషన్ ను ఆ దర్శకుడు, హీరోయిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు అనే విషయం మీకు అర్థం అయ్యి ఉంటుంది.