బాలయ్య - వెంకటేష్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ...
గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా రాబోతోందంటూ కొన్ని వార్తలైతే వినిపించాయి.
గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో బాలయ్య, వెంకటేష్ లకు ప్రత్యేకమైన స్థానం ఉంది... ఇండస్ట్రీలో ఉన్న నలుగురు అగ్ర హీరోల్లో వీళ్ళు కూడా భాగమవ్వడం గొప్ప విషయం. వీళ్ళు సాధించిన సక్సెస్ లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. 70 సంవత్సరాలకు దగ్గరవుతున్నప్పటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికి కమర్షియల్ సినిమాలను చేస్తూ సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేస్తున్నారు.
మల్టీ స్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం..
గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా రాబోతోందంటూ కొన్ని వార్తలైతే వినిపించాయి. సీనియర్ ఎన్టీఆర్, డాక్టర్ డి రామానాయుడు ఇద్దరు కలిసి బాలయ్య వెంకటేష్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ కథ ఇద్దరి ఇమేజ్ కి సరిపడే విధంగా లేకపోవడం తో సినిమా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శక నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాను చేసి సక్సెస్ ని సాధిస్తే బాగుంటుందని అటు నందమూరి అభిమానులు, ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుందనేది క్లారిటీ లేదు.
సోలో గా రాణిస్తున్న బాలయ్య- వెంకటేష్...
కెరియర్ స్టార్టింగ్ నుంచి బాలయ్య చేసిన సినిమాలతో ఆయనకి మాస్ లో విప్మృతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పటికి అదే జోష్ లో ముందుకు సాగుతున్నాడు. అఖండ, భగవంత్ కేసరి, వీర సింహా రెడ్డి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. వెంకటేష్ సైతం గత సంవత్సర 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించాలనే ఆలోచన మంచిదే. ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఈ జనరేషన్ కి తగ్గ కథ తో సీనియర్ హీరోలను కలిపి సినిమా చేయగలిగితే మూవీ మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను భారీగానే వసూలు చేస్తుందని మరికొంతమంది సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు... మొత్తానికైతే ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా సైతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...