శ్రీకాంత్ ఓదెల ఇతర భాషల హీరోలను అప్రోచ్ అవుతున్నారా?
తొందరలోనే ఆయన తన సినిమా గురించి అప్డేట్ ని ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
'దసరా' మూవీతో దర్శకుడిగా కెరియర్ ను స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. కానీ రీసెంట్ గా వచ్చిన 'ప్యారడైజ్' మూవీ అనుకున్న రిజల్ట్ ను ఇవ్వలేదు. దాంతో శ్రీకాంత్ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో చిరంజీవితో సినిమా అంటూ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికి ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశాలైతే లేవు. కాబట్టి ఈ గ్యాప్ లో శ్రీకాంత్ ఓదెల మరో హీరోతో సినిమా చేయాల్సిందే. తెలుగు స్టార్ హీరోలందరు తమ లైనప్ తో బిజీగా ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు శ్రీకాంత్ కి డేట్స్ ఇచ్చే హీరో లేరు...
ధనుష్ తో చర్చలు జరుపుతున్నాడా..
శ్రీకాంత్ ఇంతకు ముందు చేసిన రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చాయి. కానీ ఇప్పుడు తన రూట్ మార్చి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించే విధంగా ఒక సబ్జెక్ట్ ను రెడీ చేస్తున్నారట. ఈ కథతో ధనుష్ ని అప్రోచ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ధనుష్ బిజీగా ఉన్నప్పటికి శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చితే తనకు డేట్స్ ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నాడట. నిజానికి ధనుష్ దగ్గరకి మంచి కథలు వస్తే వాటిని మిస్ చేసుకోడు. ఏదో ఒకరకం గా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడు. అదే కాన్ఫిడెంట్ తో శ్రీకాంత్ ధనుష్ ను కలిసి కథ వినిపించాలని చూస్తున్నాడట. శ్రీకాంత్ సైతం ధనుష్ అయితేనే తన స్టోరీ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆయనైతేనే సినిమాకి సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్ ధనుష్ కి కథ వినిపించే ప్రయత్నంలో చేస్తున్నాడట.
ప్యారడైజ్ టీమ్ బిజీ అయిపోయారా...
ఇప్పటికే శ్రీకాంత్ ను మినహాయిస్తే ప్యారడైజ్ సినిమా టీమ్ మొత్తం బిజీ అయిపోయారు. నాని 'బ్లడీ రొమియో' షూట్ ఓ పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ప్రొడ్యూసర్ 'సుధాకర్ చెరుకూరి' సైతం శ్రీశ్రీ సినిమాతో చేస్తున్నాడు. అనిరుధ్ తన లైనప్ లో ఉన్న మూవీస్ కి మ్యూజిక్ ని అందిస్తూ బిజీ అయిపోయాడు. శ్రీకాంత్ ఓదెల మాత్రమే ఖాళీగా ఉన్నారు తన నుంచి ఇంకా అనౌన్స్ మెంట్ రావడంలేదని అతని అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు...
తొందరలోనే ఆయన తన సినిమా గురించి అప్డేట్ ని ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్యారడైజ్ నిరాశ పరిచింది కాబట్టి రాబోయే సినిమాతో సూపర్ హిట్ ను అందించాలని తద్వారా ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. దానికోసమే కొంచెం టైం తీసుకున్న పర్లేదు కానీ మంచి కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నాడట... ఈసారి ఎలాంటి సబ్జెక్టుతో రాబోతున్నాడు సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా అతని సినిమా ఉండబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...