రీ టేక్, వన్స్ మోన్... హీరో గారి జీవిత పాఠాలు
ఇటీవల తన తండ్రితో కలిసి ఏకంగా 25 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి చదువు ఖర్చు సూర్య భరించబోతున్నాడు.
తమిళ్ స్టార్ నటుడు సూర్య నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు. తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఆర్థిక సాయం, ఇతర సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సూర్య రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. చాలా మంది హీరోలు సినిమాల్లో హీరోయిజం చూపిస్తారు, కానీ సూర్య మాత్రం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ తన మంచి తనం చూపిస్తూ హీరోయిజం చూపిస్తూ వస్తున్నాడని అభిమానులు అంటూ ఉంటారు. ఇప్పటికే సూర్య చేసిన ఆర్థిక సాయంతో ఎంతో మంది పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించారు, ఇంకా చాలా మంది ఎంబీబీఎస్ చదువుతున్నారు. సూర్య ఆర్థిక సాయంతో మరెంతో మంది ఇతర రంగాల్లోనూ సెటిల్ అయిన వారు ఉన్నారు. తాజాగా మరోసారి సూర్య తన అగరం ఫౌండేషన్ తరపును పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
తమిళ్ స్టార్ హీరో ఆర్థిక సాయం...
ఇటీవల తన తండ్రితో కలిసి ఏకంగా 25 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి చదువు ఖర్చు సూర్య భరించబోతున్నాడు. అందులో భాగంగా మొదటి దఫా అమౌంట్ను వారికి ఇవ్వడం జరిగిందని, వారు చదువులో ప్రతిభ కబర్చడంను బట్టి ఆర్థిక సాయంను అందజేయడం జరుగుతుందని అగరం ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా సూర్య చేస్తున్న ఈ మంచి పనులను చాలా మంది అభినందిస్తున్నారు. కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునే చాలా మంది హీరోలు కనీస ఆర్థిక సహాయం చేయకుండా, నాకేంటి అన్నట్టుగా ఉంటారు. అలాంటిది సూర్య వందలాది మందికి ఆర్థిక సాయం చేసి, వారికి ఉన్నత చదువులు ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.
అగరం ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం...
తాజాగా 25 మందికి ఆర్థిక సాయం చేసిన సందర్భంగా సూర్య మాట్లాడుతూ విద్యార్థులకు జీవిత సత్యాలను తెలియజేస్తూ, జీవితంలో ఎదుగుదలకు ఎలా కష్టపడాలి అనే విషయాలను బోధించాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకు యువత ఆకర్షించబడుతుంది. ఇంటర్నెట్లో కేవలం రీల్స్ చేయడం ద్వారా, షాట్స్ చూడటం వల్ల జీవితాలు బాగుపడవు, కష్టపడి చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సినిమా షూటింగ్ సమయంలో ఒక షాట్ లేదా సీన్ సరిగ్గా రాకుంటే రీ టేక్ కి ఛాన్స్ ఉంటుంది, కానీ జీవితంలో తప్పులు చేస్తే రీ టేక్ కు ఛాన్స్ లేదు. కనుక ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని సూర్య విద్యార్థులకు సూచించాడు. జీవితంలో చదువు అనేది అత్యంత ముఖ్యమైనది అనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని సూర్య చెప్పుకొచ్చాడు.
సూర్య సీన్ సినిమా రిలీజ్కి రెడీ...
చదువు కేవలం మార్కుల కోసం కాదని, జీవితంలో స్థిరపడటం కోసం బలమైన పునాది అవుతుందని అన్నారు. చదువులో వెనక పడ్డ ప్రతిసారి మనకు మనం వన్స్ మోర్ అని ధైర్యం చెప్పుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే దాన్ని నుంచి విషయం నేర్చుకుని, వన్స్ మోర్ అనుకుని మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాలి. చదువులో మొండి పట్టుదల ఉండాలి, జీవితంలో ఏదైనా సాధించాలనే మొండి పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా విద్యార్థులకు సూర్య జీవిత పాఠాలు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఫ్యామిలీకి గుర్తింపు తీసుకు రావాలని, ఓటమి వచ్చిన వెంటనే మొత్తం జీవితం పూర్తి అయినట్లు భావించకుండా, మళ్లీ ప్రారంభించాలి అన్నాడు. సూర్య మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య సినిమాల విషయానికి వస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూర్య త్వరలో సీన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు సూర్య 48 మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.