ఈ ఇద్దరి కం బ్యాక్ కోసం వెయిటింగ్..
కానీ సమస్యల్లా పాత సినిమాలకు వస్తున్న క్రేజ్.. వీళ్ల కొత్త ప్రాజెక్టులకు రాకపోవడమే. శ్రీను వైట్లకు ఒకప్పుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలతో నడిపించిన కామెడీ ట్రాక్సే అతిపెద్ద బలంగా ఉండేవి.
శ్రీను వైట్ల సెట్ లో పూరి జగన్నాథ్ ప్రత్యక్షమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శర్వానంద్ తో వైట్ల తీస్తున్న 'జార్జ్ క్రిష్' సెట్స్ కు పూరి వెళ్లడం, ఇద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించుకోవడం చూసిన నెటిజన్లకు ఒకప్పటి గోల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు కల్ట్ కమర్షియల్ డైరెక్టర్లు కనిపించగానే లైకులు కొట్టి వదిలేయకుండా.. ఫ్యాన్స్ మాత్రం కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
నిజానికి పూరి, శ్రీను వైట్ల మార్క్ టాలీవుడ్ కమర్షియల్ సినిమాను పూర్తిగా మార్చేసింది. మహేష్ బాబుకు 'పోకిరి'తో పూరి ఇచ్చిన హీరో ఆటిట్యూడ్, 'దూకుడు'తో వైట్ల పండించిన టైమింగ్ బాక్సాఫీస్ హిస్టరీలో నిలిచిపోయాయి. పూరి పెన్ను నుంచి వచ్చిన ఇడియట్, బిజినెస్ మ్యాన్ డైలాగులు.. వైట్ల బ్రాండ్ వెంకీ, రెడీ, ఢీ కామెడీ ట్రాక్స్ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో హోరెత్తుతూనే ఉన్నాయి. తమదైన శైలితో స్టార్ హీరోలకు సైతం కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన ఘనత వీరి సొంతం.
కానీ సమస్యల్లా పాత సినిమాలకు వస్తున్న క్రేజ్.. వీళ్ల కొత్త ప్రాజెక్టులకు రాకపోవడమే. శ్రీను వైట్లకు ఒకప్పుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలతో నడిపించిన కామెడీ ట్రాక్సే అతిపెద్ద బలంగా ఉండేవి. కాలక్రమంలో అదే ఫార్ములా రొటీన్ అయిపోవడంతో ఆడియన్స్ కు బోర్ కొట్టేసింది. రీసెంట్ గా వచ్చిన 'విశ్వం'తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం సంక్రాంతి టార్గెట్ గా శర్వానంద్, మానస వారణాసితో వస్తున్న 'జార్జ్ క్రిష్' కోసం మళ్లీ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ నే నమ్ముకున్నారు.
ఇటు పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 'ఇస్మార్ట్ శంకర్'తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చారనుకునేలోపే.. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' రూపంలో వరుస డిజాస్టర్లు తగిలాయి. హీరో బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ బాగుంటున్నా.. పాతబడ్డ టెంప్లేట్ కథలతో రావడం బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతోంది. ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' చేస్తున్నారు. రెగ్యులర్ మాస్ హీరో కాకుండా విజయ్ సేతుపతి లాంటి నేచురల్ పెర్ఫార్మర్ తో చేస్తుండటంతో దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి ఉంది.
వీరిద్దరి విషయంలో ఒక విచిత్రమైన ఈక్వేషన్ కనిపిస్తోంది. పాత సినిమాలను రీ రిలీజ్ లు, యూట్యూబ్ లో ఇప్పటికీ ఎగబడి చూస్తున్న ప్రేక్షకులు.. కొత్త సినిమాలకు వచ్చేసరికి మాత్రం ఆ అవుట్ డేటెడ్ మీటర్ ను ఏమాత్రం సహించడం లేదు. ఆడియన్స్ కు పూరి మార్క్ క్యారెక్టరైజేషన్, వైట్ల మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కావాలి.. కానీ వాటిని ప్రెజెంట్ చేసే స్క్రీన్ ప్లే మాత్రం నేటి ట్రెండ్ కు తగ్గట్టు కొత్తగా ఉండాలి.
ఈ బ్యాలెన్స్ కుదిరిన రోజే వీళ్ల అసలైన మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుంది. ప్రస్తుతానికి శర్వానంద్ డ్యూయల్ రోల్ లో చేస్తున్న 'జార్జ్ క్రిష్' జనవరి 14న సంక్రాంతి బరిలో దిగుతుండగా, విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్' కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇద్దరు దర్శకులకు ఈ ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ సారి పాత ఫార్ములాను దాటి నేటి ఆడియన్స్ పల్స్ ను పట్టుకుంటారో లేదో చూడాలి.