పువ్వుల అందాన్నే డామినేట్ చేస్తున్న సిమ్రాన్.. ఆ లుక్ అదరహో!

సిమ్రాన్ చౌదరి ఈ ఫోటోలలో బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి బుగ్గలు ఎరుపెక్కేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.;

Update: 2025-10-16 06:10 GMT

ముగ్ధ మనోహరమైన మోముతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ అభిమానులను అలరించే దిశగా అడుగులు వేస్తున్నారు హీరోయిన్స్. అటు గ్లామర్ తోనే కాదు ఇటు సాంప్రదాయంగా కూడా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది వయసు పెరిగినా.. అందాన్ని తగ్గించుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ హీరోయిన్స్ అందం చూసి పువ్వుల అందం కూడా తక్కువేనేమో అనేంతల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా ఎప్పటికప్పుడు తమ అందంతో.. మేని ఛాయతో అపురూపమైన సౌందర్య లావణ్యవతులుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హీరోయిన్స్.


అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి కూడా ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు ఆడియన్స్ ను ఇటు ఫాలోవర్స్ ను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటోంది ఈ చిన్నది. అందులో భాగంగానే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో తన ముఖానికి దగ్గరగా పువ్వులను తాకిస్తూ చాలా మనోహరంగా ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆ పువ్వులు, ఈమె ముఖాన్ని ఒకే దగ్గర పెట్టి చూసేసరికి పువ్వుల అందాన్ని ఈమె డామినేట్ చేస్తోంది అంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చూడ చక్కని అందంతో మేని ఛాయతో మరొకసారి మెస్మరైజ్ చేస్తోంది సిమ్రాన్ చౌదరి.


సిమ్రాన్ చౌదరి ఈ ఫోటోలలో బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి బుగ్గలు ఎరుపెక్కేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఏది ఏమైనా రోజురోజుకు మరింత అందంగా ముస్తాబవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి దర్శకుల కంట్లో ఎప్పుడు పడుతుందో? ఎప్పుడు ఈమెకు వరుస అవకాశాలు వస్తాయో చూడాలి అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


హైదరాబాద్ కి చెందిన ఈ చిన్నది డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. 1996 జూలై 17న జన్మించిన ఈమె 12 సంవత్సరాల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించి.. సంపాదించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అలాగే అదే ఏడాది మిస్ హైదరాబాదుగా కూడా ఎంపికయింది. ఇక 2017లో సెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను కూడా దక్కించుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది.


2014లో వచ్చిన హమ్ తుమ్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈ నగరానికి ఏమైంది, బొంభాట్, చెక్, పాగల్, సెహారి, అధర్వ , ఆ ఒక్కటి అడక్కు, లవ్ మీ అంటూ పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె అవినాష్ హీరోగా వస్తున్న ఒక కొత్త సినిమాకి హీరోయిన్ గా ఎంపికయింది.. ఇటీవలే ఘనంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్.ఎల్.పీ ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వస్తున్న ఈ సినిమా హైదరాబాదులోని సారథి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. కార్తీ దర్శకుడిగా.. శాంత నూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని , అంకిత్ రెడ్డిలు నిర్మిస్తున్నారు

Tags:    

Similar News