ఇన్న‌ర్‌లో సిద్ధిక రెబ‌ల్ యాటిట్యూడ్

సిద్ధికా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న పైసా వ‌సూల్ చిత్రంలో న‌టించింది.;

Update: 2025-05-24 01:30 GMT

సిద్ధికా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న పైసా వ‌సూల్ చిత్రంలో న‌టించింది. కానీ టాలీవుడ్ లో ఈ భామ‌కు క‌లిసి రాలేదు. అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌య‌త్నించినా కానీ, ఆశించినంత‌గా పాపుల‌ర్ కాదు. అడ‌పాద‌డ‌పా పంజాబీ మ్యూజిక్ ఆల్బ‌మ్ ల‌తో అభిమానుల‌కు మాత్రం టచ్ లో ఉంది. తాజాగా సిద్ధిఖి శ‌ర్మ మ‌రో పంజాబీ సింగిల్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది.


అయితే సిద్ధిక శ‌ర్మ సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల‌కు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్న‌ర్ సొగసును ఎలివేట్ చేస్తూ, కుర్ర‌కారు హృద‌యాల‌ను స్ప‌ర్శించింది. బ్లాక్ క‌ల‌ర్ ఇన్న‌ర్, కాంబినేష‌న్ బ్లాక్ ట్రాక్ ని ధ‌రించిన సిద్ధిక రెబ‌లియ‌న్ స్టైల్లో ఫోజులిచ్చింది. బ్లాక్ ఇన్న‌ర్ పై క‌వ‌రింగ్ కోట్ ని కూడా ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే సిద్ధిక సినిమాలు, సిరీస్ ల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు సింగిల్స్ లోను న‌ర్తిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన `ఓయే మఖ్నా` నుండి రొమాంటిక్ ట్రాక్ `ఎన్హా అంఖియాన్ చ్ పావా కివే కజ్రా`లో కొత్త జంట సిద్ధికా శర్మ - అమ్మీ విర్క్ పై గీతం. ఇప్పుడు టి సిరీస్ భూష‌ణ్ కుమార్ నిర్మించిన తాజా ఆల్బ‌మ్ లో సిద్ధిక మ‌రోసారి మెరిసింది. అద్భుత‌మైన ఎమోష‌న్స్ ప‌లికిస్తూ మంచి సాహిత్యంతో పాట‌ల్ని స్వ‌ర‌ప‌రిచే గాయకుడు-స్వరకర్త మనన్ భరద్వాజ్ రొమాంటిక్ గీతం `మై తేరే సంగ్‌`లో సిద్ధిక‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇది ఒక అంద‌మైన రొమాంటిక్ సాంగ్. ఒక చిన్న టౌన్ లో అందంగా మ‌లిచారు. మాన‌వ్ తో సిద్ధిక రొమాన్స్ గొప్ప‌గా పండింది. ఈ పాటకు సాహిల్ బఘ్రా దర్శకత్వం వహించారు. ఇప్పుడు అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

బాలీవుడ్ - పంజాబీ మ్యూజిక్ సర్క్యూట్‌లో ఇప్పటికే సుపరిచితమైన పేరు మనన్ భరద్వాజ్, యానిమల్ నుండి అర్జన్ వైల్లీ, యారియన్ 2 నుండి ఊంచి ఊంచి దీవారేన్ ల‌తో పాపుల‌రయ్యాడు. అత‌డి నుంచి లేటెస్ట్ సాంగ్ `మై తేరే...` ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News