పిక్‌టాక్ : చీర కట్టులో ఇంత అందంగా మరెవరైనా ఉంటారా?

సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో 2008లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌.;

Update: 2025-09-01 05:29 GMT

సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో 2008లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అయితే ఈమెకు ప్రతిభకు తగ్గట్టుగా ఆఫర్లు దక్కలేదు. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. హిట్స్ లేకున్నా, పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రాకున్నా హీరోయిన్స్‌ వెంటనే కనుమరుగు అవుతారు. కానీ శ్రద్ధా దాస్ మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ ల్లో కనిపిస్తూ వస్తుంది. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలను రెగ్యులర్‌గా షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈమె సొంతం కావడంతో ఎలాంటి ఔట్‌ ఫిట్‌లో అయినా అలరిస్తూ ఉంటుంది.


సోషల్‌ మీడియాలో శ్రద్ధా దాస్‌ అందాల షో

శ్రద్ధా దాస్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటించింది. ముఖ్యంగా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటించడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేకున్నా ఇంతటి క్రేజ్‌ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ అమ్మడికి అందం అవకాశాలను తెచ్చి పెట్టింది, అదే అందం ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగేలా చేసింది. సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటాయి. అంతే కాకుండా ఈమె స్థాయిని ఆ ఫోటోలు, వీడియోలు పెంచుతూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు సైతం ఈమె స్థాయిని మరింత పెంచే విధంగా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


చీర కట్టులో శ్రద్ధా దాస్‌ కవ్వింపులు

నాలుగు పదులకు చేరువ అయిన ఈ అమ్మడు ఇప్పటికీ పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా అందంగా ఉంది. తాజాగా ఈమె చీర కట్టులో నడుము అందం చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగానే శ్రద్ద దాస్‌ను చీర కట్టు ఔట్‌ ఫిట్‌లో చూస్తే చూపు తిప్పలేం. అలాంటిది నడుము అందం చూపిస్తూ, కవ్విస్తే మతిపోవడం ఖాయం. చాలా సార్లు శ్రద్ధా దాస్‌ను చూర కట్టులో చూసి చాలా మంది ఇంత అందంగా మరే హీరోయిన్‌ ఉండదు అంటూ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోసారి అదే తరహా కామెంట్స్ ను సోషల్‌ మీడియాలో నెటిజన్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, ఎలాంటి ఔట్‌ ఫిట్‌లో అయినా ఆకర్షణీయంగా కేవలం ఈ అమ్మడు మాత్రమే ఉంటుందని, ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు ఈమెకు మాత్రమే సాధ్యం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


పలు భాషల్లో నటించిన శ్రద్దా

చీర కట్టులో శ్రద్ధా దాస్‌ను మించి మరెవ్వరూ ఇంత అందంగా ఉండరు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందంగా ఉన్న శ్రద్ధా దాస్‌కి సినిమా ఇండస్ట్రీలో రావాల్సిన స్థాయి ఆఫర్లు రాలేదని, దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని, అంతే కాకుండా ఆమెకు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహారాష్ట్రలోని బెంగాళీ కుటుంబంలో జన్మించిన శ్రద్దా దాస్‌ ముంబై యూనివర్శిసిటీలో జర్నలిజంలో పట్టభద్రురాలు అయింది. పలువురు ప్రముఖ డ్రామా కళాకారులు నిర్వహించిన వర్క్ షాప్స్‌ లో శిక్షణ పొందడంతో పాటు, డాన్స్‌ లోనూ మంచి ప్రావిణ్యం సంపాదించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ శ్రద్దా దాస్‌ నటించింది.

Tags:    

Similar News