కెమెరా ఫోజులతో ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా!
ప్రముఖ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మెప్పిస్తుంది.;
ప్రముఖ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మెప్పిస్తుంది. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు డెవిల్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది.. తొలిసారి తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలి దర్శకత్వంలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ గా వచ్చిన 'మనం' సినిమాలో అతిథి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జైలవకుశ, రాజా ది గ్రేట్, వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో చాలా చిత్రాలలోనే నటించింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన రాశి కన్నా.. మూడు వెబ్ సిరీస్లలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో ఉత్తమ తొలి నటిగా సైమా అవార్డు అందుకుంది.
ఇకపోతే గత ఏడాది తమిళ్, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్ నుండి ఒక ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది రాశి ఖన్నా.
ఇదిలా ఉండగా ఇప్పుడు 'తెలుసు కదా' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి నీరజా కోనా దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ , రాశీ కన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాను నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక్కో సినిమాపై ఒక్కోసారి హైప్ తీసుకొస్తూ అంచనాలు పెంచుతోంది.
తాజాగా 'తెలుసు కదా' సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోలు పంచుకున్న రాశీ ఖన్నా.. కెమెరాతో సెల్ఫీలు దిగుతూ అద్దం ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా ఈ ఫోటోలకు కింద క్యాప్షన్ గా "మీకు తెలుసు కదా.. నాకు కెమెరా.. మిర్రర్.. బర్గర్ అంటే చాలా ఇష్టమని" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికైతే తెలుసు కదా సినిమా షూటింగ్ సెట్లో తన పాత్ర కోసం మేకప్ చేయించుకుంటూ తీసుకున్న ఫోటోలను తాజాగా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ