బాడీ కాఫీలా వేడిగా స్ట్రాంగ్‌గా ఉండాలి: రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ పరిచయం అవసరం లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ భామ నటించింది.;
రాయ్ లక్ష్మీ పరిచయం అవసరం లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ భామ నటించింది. ఇటీవల కెరీర్ కొంత స్లో అయింది. కానీ సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉంది. వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ వేడెక్కించే క్యాప్షన్స్ తో రాయ్ లక్ష్మీ ఆకట్టుకుంటోంది. తాజాగా షేర్ చేసిన బాడీ హగ్గింగ్ ట్రాక్ సూట్ పై వేడెక్కించే వ్యాఖ్యను జోడించింది. నా బాడీ నా కాఫీలా ఎప్పుడూ వేడిగా స్ట్రాంగ్ గా ఉండాలని అంది. అయితే ఇది బ్రూ కాఫీనా? లేక అరకు కాఫీనా? అంటూ నెటిజనులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. రాయ్ లక్ష్మీ హా* ఫోజులు ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల జీ టీవీ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మీ తన పాత రోజులను గుర్తు చేసుకుంది. నటిగా కెరీర్ ఆరంభమే భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో డేటింగ్ చేసిందనే పుకార్లు సంచలనంగా మారాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ రోజుల్లో 2008లో వారి రిలేషన్ గురించి కథనాలొచ్చాయి. కలిసి జంటగా పార్టీలలో సందడి చేయడం పుకార్లకు ఆజ్యం పోసింది. ధోని అప్పట్లో రాయ్ లక్ష్మి పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరవ్వడం చర్చగా మారింది. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా బ్రేకప్ అయింది. 2014లో రాయ్ లక్ష్మీ ఈ పుకార్ల గురించి మాట్లాడుతూ.. ధోనితో తన సంబంధం ఒక మచ్చ లేదా మరక లాంటిదని చెప్పారు. అది చాలా కాలం వరకు మాయమవదు. ఇప్పటికీ ప్రజలు దాని గురించి మాట్లాడటానికి శక్తి, ఓపికను కలిగి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. టీవీల్లో ఎప్పుడూ దీనినే ప్రస్థావిస్తారు. ఏదో ఒక రోజు నాకు పుట్టబోయే పిల్లలు దానిని టీవీలో చూసి దాని గురించి అడుగుతారని నేను భయపడుతున్నాను! అని కూడా అంది. తాము స్నేహితులం మాత్రమేనని, స్నేహపూర్వకంగా విడిపోయామని కూడా తెలిపింది.
ఎం.ఎస్.ధోని వివాహం చేసుకున్నాడు... అది కథకు ముగింపు అని కూడా రాయ్ లక్ష్మీ ఇటీవలి ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టానని చెప్పింది. నటన తన తొలి ప్రాధాన్యత అని కూడా వెల్లడించింది.