• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డింపుల్ హయాతి.. జలపాతంలో...

డింపుల్ హయాతి.. జలపాతంలో బికినీ అందం

| టాలీవుడ్ గ్లామర్ క్వీన్ డింపుల్ హయాతి మరోసారి తన ఫ్యాషన్ మరియు గ్లామర్ లుక్ తో సోషల్ మీడియా లో దుమ్ము రేపుతోంది.

By - Tupaki Desk
Update: 2024-10-13 11:30 GMT

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ డింపుల్ హయాతి మరోసారి తన ఫ్యాషన్ మరియు గ్లామర్ లుక్ తో సోషల్ మీడియా లో దుమ్ము రేపుతోంది. రెగ్యులర్ గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో ప్రత్యేక ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంటూ వారిని అలరిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ, ఇప్పుడు తాజా ఫోటోషూట్ ద్వారా అందర్నీ ఆకట్టుకుంటోంది.


తెలుగు అమ్మాయి అయిన డింపుల్ తన గ్లామర్ తో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. మొదట 'గల్ఫ్' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత 'అభినేత్రి 2'లో ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్ లో కీలక పాత్రలో కనిపించినప్పటికీ, అది కూడా పెద్దగా విజయం సాధించలేదు.


అయితే డింపుల్ హయాతికి బ్రేక్ ఇచ్చింది మాత్రం 'గద్దలకొండ గణేష్' సినిమా. ఆ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సాంగ్ తో అందరికి సుపరిచితమైన డింపుల్, తర్వాత 'యురేకా' మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే మాస్ మహారాజా రవితేజతో 'ఖిలాడీ' చిత్రంలో హీరోయిన్ గా కనిపించి, తన గ్లామర్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఆ సినిమాలో డింపుల్ బికినీ వేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఈ లుక్ తో తన గ్లామర్ పాత్రలకు తాను సిద్ధమని స్పష్టంగా చెప్పింది. తాజాగా డింపుల్ హయాతి షేర్ చేసిన ఈ ఫోటోలో ఆమె ఒక అందమైన జలపాతం వద్ద సొగసైన బ్లాక్ బికినీ అవుట్‌ఫిట్ ధరించి కనిపించింది. ప్రకృతి మధ్యలో, నీటి ప్రవాహంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో డింపుల్ తన లుక్‌తో మరింత గ్లామర్‌ జోడించింది.


ఫోటోలో ఆమె అందం, లుక్స్ ని మేళవించడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు కాస్తా వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 55,000 మందికి పైగా లైక్స్ అందుకున్న ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. "డింపుల్ కళ్ళలోనే గ్లామర్ ఉంది" అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


పాత్రలోనూ, వాస్తవ జీవితంలోనూ తన గ్లామర్ ను ఎలా ప్రదర్శించాలో డింపుల్ కు బాగా తెలుసు. కెరీర్ లో వ‌రుస‌గా ప్రాజెక్టులు చేస్తూ, తన గ్లామర్ తో అభిమానులని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. ఇటీవల డింపుల్ హయాతి గోపిచంద్ సరసన 'రామబాణం' సినిమాలో నటించినా, ఆ చిత్రం కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించలేదు. అయినప్పటికీ, డింపుల్ తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags:    
  • Dimplehayathi 
  • Pictalk 
  • Actressdimplehayathi 
  • Tollywood 
  • Filmindustry 
  • Movies 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS