పిక్‌టాక్ : డార్క్ షేడ్‌లో క్యూట్ బ్యూటీ
తాజాగా మరోసారి ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డార్క్ షేడ్ ఔట్ ఫిట్ తో పాటు డార్క్ కలర్ లిప్ స్టిక్ కనిపించింది.;
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా పరిచయం అయ్యి, ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. మొదటి సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న అవికా గోర్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌గా అవికా గోర్ కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అంతే కాకుండా కొన్ని అనవసర ఎంపికల కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో ఈమెకు ఆఫర్లు లభించడమే కష్టం అయింది.
సినమా ఇండస్ట్రీపై ఆసక్తి, ఫ్యాషన్‌తో అవికా గోర్ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ముఖ్యంగా తన ఫిజిక్ విషయంలో ఉన్న విమర్శలను ఆమె పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. చాలా మంది హీరోయిన్స్ మాదిరిగానే బరువు తగ్గడం ద్వారా మరోసారి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకుంది. రీ ఎంట్రీలోనూ అవికా కు అంతంత మాత్రమే అన్నట్లుగా ఆఫర్లు వచ్చాయి. అందరు హీరోయిన్స్ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అవికా గోర్ సైతం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి సమయంలోనూ వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా మరోసారి ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డార్క్ షేడ్ ఔట్ ఫిట్ తో పాటు డార్క్ కలర్ లిప్ స్టిక్ కనిపించింది. అవికా క్యూట్ అందాలతో ఆకట్టుకుంది. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేసిన ఫోటోలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఫోటోల్లో అవికా పెద్దగా స్కిన్ షో చేయకున్నా అందంగా కనిపించడం ద్వారా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈమె అందంకు తగ్గట్లు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రాకపోవడం దారుణం అని, ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు రావాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
1997 జూన్ 30న జన్మించిన అవికా గోర్ బాలిక వధు సీరియల్‌లో ఆనంది పాత్రలో నటించడం ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ముంబైలోని గుజరాతీ కుటుంబంలో జన్మించిన అవికా ములుండ్ శివారులోని షారన్ స్కూల్‌లో చదువుకుంది. ఈమె ప్రస్తుతం మిలింద్ చాంద్వానీతో ప్రేమలో ఉందని సమాచారం. తెలుగులో ఈమె ఇటీవల షణ్ముఖ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పరచడంతో మరో ఆఫర్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది. ముందు ముందు ఈమె మరిన్ని సినిమాలు నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.