'నన్ను జడ్జ్ చేయండి'.. అషు రెడ్డి బోల్డ్ లుక్ వైరల్

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచే పేరు అషు రెడ్డి.;

Update: 2025-12-01 12:30 GMT

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచే పేరు అషు రెడ్డి. డబ్స్మాష్ వీడియోలతో 'జూనియర్ సమంత'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు. వెండితెరపై కనిపించింది తక్కువే అయినా, సోషల్ మీడియాలో మాత్రం అగ్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. తన గ్లామర్తో, బోల్డ్నెస్తో ఇంటర్నెట్ను షేక్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.




 


తాజాగా అషు రెడ్డి తన వెకేషన్కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె బాహమాస్లోని అందమైన లొకేషన్లలో చిల్ అవుతున్నారు. అక్కడ దిగిన ఫొటోలలో.. లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్ను ధరించి ఎంతో స్టైలిష్గా, గ్లామరస్గా దర్శనమిచ్చారు. సూర్యకాంతిలో చేతులతో లవ్ సింబల్ పెడుతూ, తన వంపుసొంపులతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు, "నన్ను జడ్జ్ చేయండి" అంటూ పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె కాన్ఫిడెన్స్కు, గ్లామర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.




 


నితిన్ హీరోగా నటించిన 'చల్ మోహన్ రంగ' చిత్రంతో అషు రెడ్డి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హౌస్లో ఉన్నన్ని రోజులు తనదైన ఆటతీరుతో, గ్లామర్తో ఆకట్టుకున్న ఆమె, బయటకు వచ్చాక తన క్రేజ్ను రెట్టింపు చేసుకున్నారు. ఆ మధ్య సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు ఆమెను ఇంటర్నెట్ సెన్సేషన్గా మార్చేశాయి. ఆ ఇంటర్వ్యూల ద్వారా వచ్చిన పబ్లిసిటీతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.




 


ప్రస్తుతం అషు రెడ్డి సినిమాల కంటే విదేశీ పర్యటనలు, సోషల్ మీడియా ప్రమోషన్లపైన ఎక్కువ దృష్టి సారించారు. తరచుగా దుబాయ్, అమెరికా వంటి దేశాలకు వెళ్తూ.. అక్కడి లగ్జరీ లైఫ్స్టైల్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులతో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. నటిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే, వెబ్ సిరీస్లు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. సినిమా అవకాశాలు లేనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి హవా కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News