అందాల రాక్షసిలా అనసూయ హొయలు

ఈ సారి అనసూయ ఫుల్ బ్లాక్ థీమ్‌లో ఉండే బ్లౌజ్, పుష్పగుచ్ఛాల డిజైన్‌తో ఉన్న ఫ్లోరల్ చీరతో మెరిసింది.;

Update: 2025-05-23 19:12 GMT

గ్లామర్‌కు మరో పేరు అనసూయ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. టెలివిజన్ షోలకు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సూపర్ గ్లామరస్ ఇమేజ్‌తో వెలుగొందుతోంది. లేటెస్ట్ గా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప చిత్రంలోని దాక్షాయణి పాత్రతో మంచి గుర్తింపు పొందిన అనసూయ, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ దర్శనమిచ్చింది.


ఈ సారి అనసూయ ఫుల్ బ్లాక్ థీమ్‌లో ఉండే బ్లౌజ్, పుష్పగుచ్ఛాల డిజైన్‌తో ఉన్న ఫ్లోరల్ చీరతో మెరిసింది. నైట్ లైట్స్‌లో ఆమె కరెంట్ కట్‌లా మెరిసిపోయింది. ప్రత్యేకంగా ఆమె పెట్టుకున్న గ్రీన్ నోస్ రింగ్, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో అందరూ సూపర్ గ్లామర్ అని కామెంట్లు చేస్తున్నారు. ఫోటోషూట్‌లో అనసూయ చేసిన పోజులు బోల్డ్‌గా, సెన్సేషన్‌గా ఉండటంతో నెటిజన్స్ ఆకర్షితులయ్యారు. ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్‌కి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.


అనసూయ కెరీర్ విషయానికొస్తే, 'క్షణం' సినిమా ద్వారా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్, 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో మరో లెవెల్ కు వెళ్ళింది. ఆ తర్వాత 'పుష్ప'లో దాక్షాయణిగా రఫ్ అండ్ టఫ్ రోల్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. టీవీ యాంకరింగ్‌లో వచ్చిన అనుభవాన్ని సినిమాల్లో ఉపయోగిస్తూ, బోల్డ్ గా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది.


ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అనసూయ అంతే యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌కి సంబంధించిన ఫోటోషూట్లు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త ఫోటోషూట్‌లో అనసూయ చూపించిన బోల్డ్ లుక్ చూసిన అభిమానులు 'అందాల రాక్షసిలా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తన నటనతో సినిమాల్లో విలక్షణ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇప్పుడు ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తూ మరోసారి ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది.

Tags:    

Similar News