ట్రెండీ లుక్‌తో అనసూయ అరాచకం!

మొదట టెలివిజన్ రంగంలో గుర్తింపు అందుకుని ఆ తరువాత బిగ్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్న నటి అనసూయ భరద్వాజ్‌.;

Update: 2025-04-20 13:30 GMT

మొదట టెలివిజన్ రంగంలో గుర్తింపు అందుకుని ఆ తరువాత బిగ్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్న నటి అనసూయ భరద్వాజ్‌. ఆమె టాలెంట్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా ఉన్నప్పుడు హ్యూమర్‌తో ఆకట్టుకుంది. తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప' లాంటి సినిమాలతో నటిగా ట్రాన్సిషన్ అద్భుతంగా చేసుకుంది. ముఖ్యంగా పుష్పలో 'దాక్షయణి' పాత్ర ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.


ఇక లేటెస్ట్ గా అనసూయ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, స్కై బ్లూ స్కర్ట్‌లో ఓ మోడ్రన్ లుక్‌తో మెరిసిపోతున్న అనసూయ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. జస్ట్ క్లాసిక్ లుక్ అని చెప్పుకోవచ్చు. మెటాలిక్ ఫాబ్రిక్ టచ్, జిప్ డిజైన్ విత్ స్లీవ్‌లెస్ స్టైల్‌తో ఈ డ్రెస్సింగ్ మోడర్న్ యూత్‌కు తెగ నచ్చేసినట్లు లైక్స్ చూస్తేనే అర్ధమవుతుంది.


ఫోటోల్లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ మూడ్స్‌ను బాగా క్యాచ్ చేస్తూ కనిపించాయి. ఒక్కో పోజ్‌కి వేరే వేరే మూడ్‌ను చూపించగలిగిన అనసూయ ప్రొఫెషనల్ యాక్ట్రెస్‌గా ఎంత అభివృద్ధి చెందినదో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, కెమెరా ఫ్రెండ్లీ నేచర్ అన్నీ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు భారీ లైక్స్ వస్తుండగా, అభిమానులు కామెంట్స్‌లో "కిల్లర్ లుక్", "ఎటిట్యూడ్ క్వీన్", "బోల్డ్ అండ్ బ్యూటిఫుల్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌కి ఫ్యాషన్ ట్రెండ్ చెప్పేలా అనసూయ ఈ ఫోటోషూట్‌లో నలుగురికీ ప్రేరణగా నిలుస్తోంది. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతోన్న 'కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ 2' షోకి అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈ షోలో ఆమె హోస్టింగ్ స్టైల్‌తో పాటు ఈ విధమైన ఫోటోషూట్స్‌తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. కెరీర్‌లోనే కాకుండా స్టైల్ లోనూ అనసూయ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటుంది అనడానికి ఈ ఫోటోలు నిదర్శనం.


Tags:    

Similar News