2027.. టాలీవుడ్ వరల్డ్ షేక్ చేసే సినిమాలు..!
ఒకప్పుడు నేషనల్ లెవెల్ లో బాలీవుడ్ సినిమాలదే ప్యూర్ డామినేషన్ కనిపించేది కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తి గా మారింది.;
ఒకప్పుడు నేషనల్ లెవెల్ లో బాలీవుడ్ సినిమాలదే ప్యూర్ డామినేషన్ కనిపించేది కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తి గా మారింది. టాలీవుడ్ సినిమాలు నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ఒకటి రెండు కాదు మన స్టార్ సినిమాలన్నీ కూడా భారీ టార్గెట్ తో పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ హవా రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. సౌత్ సినిమాల డామినేషన్ నేషనల్ వైడ్ గా మాస్ ర్యాంపేజ్ తెలుస్తుంది.
టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల హంగామా..
ఇక నెక్స్ట్ 2026 లో కూడా అదే రేంజ్ లో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల హంగామా ఉండేలా ఉంది. ప్రభాస్ రాజా సాబ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలుగా రాబోతున్నాయి. ప్రభాస్ ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. అది కూడా నేషనల్ లెవెల్ లో భారీ హైప్ తో వస్తుంది.
ఇక 2026 ఇలా ఉంటే 2027 టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసుకుని వస్తున్నాయి. ఆ ఏడాది ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు భారీ కాంబినేషన్స్.. ఇంకా ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని వస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్..
2027 సినిమాల లిస్ట్ లో వరుసలో మొదటి సినిమా ఎస్.ఎస్.ఎం.బి 29.. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్ లో బజ్ ఉంది. అది కూడా మహేష్ తో కాబట్టి ఈ ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గ్లో త్రొటర్ మూవీగా రాజమౌళి, మహేష్ సినిమా వస్తుంది.
ఈ సినిమా ఇండియానా జోన్స్ నావెల్ స్పూర్తితో మన ఇతిహాసాలను టచ్ చేస్తూ రాజమౌళి ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. సినిమాతో మహేష్ బాబు కూడా హాలీవుడ్ స్టార్ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు.
ప్రభాస్, సందీప్ స్పిరిట్..
ఇక 2027లో స్పిరిట్ గా వస్తున్నారు ప్రభాస్, సందీప్. సినిమాలు తీయడం తనకు ఇలానే వచ్చు అంటూ అర్జున్ రెడ్డి టు యానిమల్ ఆడియన్స్ ని కాదు సినీ మేకర్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తున్నాడు సందీప్ వంగ. యానిమల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
లేటెస్ట్ గా సినిమా నుంచి ఒక స్పెషల్ ఆడియో డైలాగ్స్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశాడు సందీప్ వంగ. వంగ సినిమా అంటే ఇక మాస్ ఆడియన్స్ కి పండగ అన్నట్టే. ఐతే స్పిరిట్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు సందీప్ వంగ. కచ్చితమా స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పొచ్చు.
అల్లు అర్జున్, అట్లీ.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..
ఇక ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమా కూడా ఉంది. పుష్ప ఫ్రాంచైజీలతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఈసారి అట్లీ సినిమాతో కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్, అట్లీ సినిమా కూడా పాన్ ఇండియానే కాదు వరల్డ్ సినీ లవర్స్ ని అలరించే టార్గెట్ తో వస్తుంది.
ఇదే వరుసలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. నీల్ సలార్ 1 తర్వాత ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేశాడు. దేవర తర్వాత వార్ 2 చేసిన తారక్ నీల్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడట. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి సినిమా ఉంటుందని నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ లిస్ట్ లో చరణ్ సుకుమార్ కాంబినేషన్ సినిమా కూడా ఉంది. ఆర్సీ 17వ సినిమాగా ఇది వస్తుంది. ఈ సినిమాను హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ తో సుకుమార్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. పెద్ది తర్వాత చరణ్ చేసే నెక్స్ట్ సినిమా ఇదే అని ఫిక్స్ అవ్వొచ్చు.
సో 2027 లో మిగతా భాషల సినిమాలు ఎలా ఉన్నా టాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ ఐదు సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ బజ్ తో ఏర్పరచుకున్నాయి. అంతేకాదు ఈ సినిమాలు కేవలం పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఐతే ఈ సినిమాల్లో రాజమౌళి సినిమాతో పాటు నీల్, సందీప్, సుకుమార్ సినిమాలు ఉండటంతో ఆడియన్స్ కి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.